అదిగో లగడపాటి సర్వే, ఇదిగో లగడపాటి సర్వే అంటూ గత రెండేళ్ళుగా, ఎవరికి కావాల్సిన సర్వే ఫలితాలు వాళ్ళు ఇచ్చుకుంటూ, లగడపాటి పేరు మీద తోసేసేవారు.. లగడపాటి సర్వే అంటే అంత గురి జనలాకి, అందుకే అందరూ లగడపాటి సర్వే అంటూ వదిలేవారు. కాకపోతే అవన్నీ పుకార్లే అని అనేక సార్లు లగడపాటి చెప్పారు. అయితే, ఇప్పుడు ఆఫీషయల్ గా లగడపాటి సర్వే రిలీజ్ అయ్యింది. లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరించారు. ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది.

lagadpati 16062018 2

జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది. బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. 2014లో నవోదయపార్టీ మాత్రమే ఒక్క సీటు గెలవగల్గింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్కులు అనే ప్రశ్నకు, చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారు అని 53 శాతానికిపైగా జనం అభిప్రాయ పడ్డారు. లేదు పనిచేయడం లేదు అని అంటున్న వాళ్లు 46 శాతం ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత 46 శాతం ఉంది. ఇందులో ఇప్పుడు వైసీపీ జనసేన కాంగ్రెస్ ఇతరులు పంచుకోవాల్సి ఉంటుంది.

lagadpati 16062018 3

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ, అని ప్రశ్నించగా, టీడీపీ సమర్థంగా పోరాడుతోంది అంటున్నవాళ్లు 43.84 శాతం కాగా, ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోంది అంటున్నవాళ్లు 37.46 శాతం మంది ఉన్నారు. ఇక జనసేన ప్రత్యేక హోదా పోరాటం చేస్తోంది అంటున్నవాళ్లు 9.65 శాతం మంది. ఏపీకి మోదీ అన్యాయం చేసారా అంటే అని సర్వేలో ప్రశ్నిస్తే ఏపీ ఠక్కున స్పందించింది. అవును అంటూ 83 శాతానికిపైగా అవును అని చెప్పారు. లేదు...అన్యాయం చేయలేదు అంటున్నవాళ్ల శాతం 16శాతం మాత్రమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read