సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా అందరికీ సుపరిచితం అయిన లక్ష్మీనారయాణ, జనసేన పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ కు రాజీనామా లేఖను కూడా పంపించారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని నిర్ణయాల వల్ల, తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గతంలో అనేక సార్లు, తాను ఇంకా సినిమాల్లో నటించను అని, 25 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ పోరాటం చెయ్యటం కోసం, ప్రజల కోసమే ఈ జీవితం అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే పాయింట్ పై ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తున్నారు. ఆయన రాజీనామా లేఖలో ఇదే అంశం ప్రస్తావించారు. గతంలో పవన్ కళ్యాణ్, తాను ఇంకా సినిమాల్లోకి వెళ్ళను అని చెప్పారని, ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తున్నారని, ఈ నిలకడ లేమి తనంతో, ఆయన విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. పింక్ అనే హిందీ సినిమాను పవన కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

jd 30012020 2

దీనికి సంబంధించి, ప్రీ షూట్ కూడా జరిగింది. అదే విధంగా, ఎన్నికలు అయిన ఏడు నెలలకే , పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవటం పైకూడా, చాలా మంది పార్టీ శ్రేణులు, అభ్యంతరం చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బీజేపీ అన్యాయం చేసింది అంటూ, పాచిపోయిన లడ్డులు అంటూ, మీటింగ్లు పెట్టిన పవన్ కళ్యాణ్, కేవలం ఏడు నెలల్లోనే ఎలా బీజేపీతో కలుస్తారు అంటూ ప్రశ్నలు వచ్చాయి. అలాగే, అమరావతి పై పోరాటం అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావిడి, తీరా చూస్తూ, గ్రౌండ్ లెవెల్ లో ఏమి చెయ్యక పోవటం, బీజేపీతో కలిసి అమరావతి పోరాటం అని చెప్పటం, ఇవన్నీ జనసేనలోని ఒక వర్గం ప్రజలకు నచ్చటం లేదు. ఇవి ఇలా ఉండగా, ఇప్పుడు పవన్ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారని తెలిసి, ఇప్పుడు మాజీ జేడీ పార్టీకి రాజీనామా చేసారు.

jd 30012020 3

ఇది పూర్తీ లేఖ ..."శ్రీ పవన్ కళ్యా ణ్ అధ్యక్షులు, జనసేన పార్టీ. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్త కి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికీ మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు."

Advertisements

Advertisements

Latest Articles

Most Read