రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీపార్వతి కోణంలో వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టిముట్టాయి. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసిక క్షోభకు గురిచేశారంటూ వేసిన క్యాసేట్టే వేస్తూ, హంగామా చేస్తూ, వాస్తవ ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నానంటూ టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్, వీడియోలతో వర్మ వేసిన వేషాలు చూసాం. ఇక ఎన్నికలకు మరో 13 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా పై అనవసర రాద్ధాంతం లేకుండా చూస్తున్నారు.

court 28032019 2

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ న్యాయవాది ఎస్‌ఎస్‌రావు, తెదేపా నేత పి.మోహన్‌రావుల పేరిట దాఖలైన రెండు వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు ధర్మాసనం ప్రాథమిక విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ చిత్రంలో అధికారపార్టీని తక్కువచేసి ఈ సినిమాలో చూపారని, అభ్యంతరకర సన్నివేశాలున్నాయని పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. అనంతరం గురువారానికి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగానే, ఈ రోజు ఈ విషయం పై మంగళగిరి కోర్ట్ తన తీర్పు ఇచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఇంజన్క్షన్ గ్రాంట్ చేసింది కోర్ట్.

court 28032019 3

15 /4 /2019 వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన , సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ యూట్యూబ్ , ట్విట్టర్,ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ తదితర మీడియా లలో కూడా ప్రదర్శన పై కూడా ఇంజన్క్షన్ ఆర్డర్ ఇచ్చింది. అంటే, ఏప్రిల్ 15 వరకు ఈ సినిమా విడుదల చెయ్యటానికి లేదు. మరో పక్క, రాంగోపాల్ వర్మ రాకేష్ రెడ్డి , అగస్త్య మంజు తదితరులకు నోటీసులు పంపమని కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి ప్రతికూల అంశాలతో నింపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ సినిమా విడుదలను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఎన్నికలు తొలిదశ పూర్తయ్యే వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకోవాలని టీడీపీకి చెందిని సాధినేని యామిని తదితరులు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిని విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read