దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను లోపల వేసిన సంగతి తెలిసిందే... అయితే లాలూకి ఇంకా శిక్ష ఖరారు కాలేదు... ఈ నేపద్యంలో శిక్ష ఖరారు కోసం కోర్ట్ కి వచ్చిన లాలూకి నిన్న కోర్టులో ఊహించని పరిస్థితి ఎదురైంది. అక్కడ కోర్ట్ లో న్యాయమూర్తికి లాలూ ఫిర్యాదు చేసారు... సార్, జైలులో బాగా చలిగా ఉంది, ఏమన్నా ఏర్పాట్లు చెయ్యమన్నారు... అలాగే మరో ఫిర్యాదు కూడా చేసారు.. సార్, నా కోసం కలవటానికి చాలా మంది జైలుకి వస్తున్నారు... నన్ను వారితో కలవనివ్వటం లేదు అని కూడా ఫిర్యాదు చేసారు...
దీంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.. లాలూని ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు చలి వేస్తే తబలా వాయించుకోండి, హర్మోనియం వాయించుకోండి... చలి గిలి ఏమి ఉండదు అని లాలూతో అన్నారు.. అంతే కాదు, మిమ్మల్ని కోర్టుకు పిలిపించింది ప్రజలను కలుసుకునేందుకే అని లాలూతో న్యాయమూర్తి అనటంతో, లాలూ సైలెంట్ అయిపోయారు... మరో సందర్భంలో న్యాయమూర్తితో వాదిస్తూ లాలూ ఇలా అన్నారు... ‘‘సర్... నేను కూడా లాయర్‌నే..’’ అని లాలూ అనడంతో... ‘‘అయితే జైల్లో ఇంకో డిగ్రీ చేయండి...’’ అని జడ్జి చురక వేశారు... మీ అనుచారాలు చాలా మంది నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, నేను వాటికి లొంగను అని న్యాయమూర్తి అన్నారు...
ఇదే సందర్భంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ను గుర్తు చేసుకుంటున్నారు... జగన్ ఎలాగూ కొన్ని రోజుల్లో జైలుకు వెళ్ళక తప్పదు... అప్పుడు జగన్ కి ఇలాంటి అనుభవాలు ఎన్నో వస్తాయి.. అప్పుడు జగన్ ఏమి వాయిస్తాడో, ఏమి డిగ్రీ చేస్తాడో అని పంచ్ లు వేస్తున్నారు... జగన్ కేసులు కూడా ఒక 7-8 నెలల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది... ఇవాళ కూడా జగన్ శుక్రవారం కావటంతో పాదయాత్ర ఆపి, నాంపల్లి కోర్ట్ కి వెళ్లారు... జగన్ మీద ఉన్న కేసులు చూసుకుంటే, దాదాపు 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాసం ఉంది అని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు...