కవ్వింపో.... కుళ్ళుబోతు బుద్దో... అభద్రతో... ఆంధ్రుడు అంటే చులకనో.... ఏమైనా గాని అడుగడుగునా నయవంచన చేసారు... అడ్డంకులు సృష్టించారు... రైల్వేజోన్ లేదు... ఆర్థిక లోటు పూడ్చలేదు.. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు లేవు...హోదా లేదు... పోనీ ప్యాకేజీ అనుకుంటే చట్టబద్దం చేయలేదు... రాజధాని నిర్మాణ హామీ ఏమైందో తెలియదు... కనకదుర్గ ఫ్లై ఓవర్ ఊసులేదు... విభజనహామీలు... తిరుపతి హామీలు అన్నీ హుళక్కే! ఈ రోజు ఇచ్చిన బడ్జెట్ లో అనుకున్నదే అయ్యింది... కాంగ్రెస్ డైరెక్ట్ గా గొంతు కొస్తే, బీజేపీ తడి గుడ్డతో నొప్పి తెలియకుండా గొంతు కోస్తుంది... చివరి బడ్జెట్ లో అయినా, ఎన్నికలు వస్తాయి అంటున్నారు కాబట్టి, మన కొత్త రాష్ట్రము, ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి, సహాయం చేస్తారేమో అని ప్రజలు అందరు ఆశక్తిగా ఎదురు చూసారు...
ఎప్పటిలాగే, మన మీద ఢిల్లీ పాలకుల చిన్న చూపు కొనసాగింది... విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ వచ్చేసినట్టే అని రాష్ట్ర బీజేపీ నేతలు ఊదరగొట్టారు... చివరకు చిప్ప ఇచ్చారు... అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సొమ్ముల ప్రస్తావన లేదు ? లోటు బడ్జెట్ లోటు లెక్క లేదు ? శంకుస్థాపన చేసిన విద్యాసంస్థలకు నిధుల లేవు ? పోలవరం పై ఇవ్వాల్సిన నిధుల ప్రస్తావన లేదు.. కడపలో స్టీల్ ప్లాంట్ , పోర్ట్, ప్యాకేజీకి చట్టబద్ధత లాంటి ఊసు లేదు... చివరకు ఒక్క భారీ ప్రాజెక్ట్ పై కూడా నవ్యాంధ్ర పై మోడీ కరుణ లేదు... మొత్తంగా నవ్యాంధ్ర పై కేంద్రం చిన్న చూపు కొనసాగిస్తూనే ఉంది... ఎప్పటి మాదిరిగానే కఠినంగా ఉంది.
ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం సంతృప్తికర స్థాయిలో కాదు, అసలు ప్రస్తావనే లేదు... మన రాష్ట్రం అసలు దేశంలో ఉందో లేదో కూడా కేంద్రమే చెప్పాలి... ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మన రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా, మీరు చెయ్యల్సింది మీరు చెయ్యండి... ప్రతి ఆంధ్రుడు మీ వెనుక ఉంటాం... ఆంధ్రా వాడి దెబ్బ మాములుగా ఉండదు... కొట్టినట్టు కూడా తెలియదు... చూసుకుంటే, చివరకు ఏమి మిగలదు.... 125 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ బ్రతుకు, మా రాష్ట్రంలో ఎలా ఉందో చూసి, నేర్చుకోవాల్సింది... ఢిల్లీ పెద్దలారా, గెట్ రెడీ... ప్రధాని మోడీ, నిలదీయని జగన్, పవన్ లు అయిదున్నర కోట్ల ఆంధ్రులకు క్షమాపణ చెప్పాలి. ఏపీకి కేంద్రం చేస్తున్నఅన్యాయంపై వైకాపా, బీజేపీ, జనసేన వంటి ప్రతిపక్ష నేతలు నోరు మెదపక పోవడం ఆంధ్రులను వంచించడమే...