ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బాదుడే బాదుడుకి శ్రీకారం చుట్టుంది. అయితే ఈ బాదుడు సామాన్య ప్రజల పై డైరెక్ట్ బాదుడు కాదు కానీ, ఇన్ డైరెక్ట్ బాదుడు. ఇప్పటికే ఇంటి పన్నుని విలువ ఆధారంగా కట్టాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఇంటి పన్ను, భారీగా పెరిగింది. తరువాత చెత్త పన్ను అన్నారు. తరువాత బాత్ రూమ్ పన్ను అన్నారు. ఇలా రకరకాలుగా బాదేస్తున్న, జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో మన ముందుకు వచ్చింది. ఎక్కడైనా ఒక లేఅవుట్ వేస్తే, అందులో 5% భూమి ప్రభుత్వానికి ఇవ్వాలి అంట. లేదా అక్కడ నుంచి మూడు కిమీ పరిధిలో ఎక్కడో ఒక చోట ఆ భూమి ఇవ్వాలి అంట. అదీ కుదరక పొతే, ఆ 5% భూమి విలువ ప్రభుత్వానికి కట్టాలి అంట. ఆ భూమిలో జగనన్న కాలనీలు నిర్మిస్తారాట. ఆహ్ షాక్ అయ్యారా. అవును అండి, ఇది నిజం. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసారు. మనం సామాన్యంగా లేఅవుట్లు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముతారు. సహజంగా ఇది కొనేది, మధ్య తరగతి వారే. తమ భవిష్యత్తు అవసరాల కోసం, రూపాయి రూపాయి కూడబెట్టుకుని, ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. ఇది సహజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయితే, ఇందులో సామాన్య ప్రజలకు ఏమి ఇబ్బంది, ఇది బొక్క పాడేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కదా అనుకుంటున్నారా ?

layout 07122021 2

ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు 5% భూమి ప్రభుత్వానికి ఇచ్చినా, అంత విలువ చేసే డబ్బులు కట్టినా, ఆ భారం వేసేది, అక్కడ ఫ్లాట్లు కొనుక్కునే మిడిల్ క్లాస్ వారి పైనే. లక్ష రూపాయాలలో, 5 వేలు ఇవ్వాలి అంటే, ఎవరికైనా బాదే కదా. అది మన మీద భారం వేస్తారు. అయితే ఇందులో ప్రభుత్వం ప్లాన్ మాత్రం, అద్భుతం అనే చెప్పాలి. ఇప్పడు లేఅవుట్ లు వేస్తే, అందులో 5% పేదల భూములకు ఇవ్వాలి అంటున్నారు. అంటే మిడిల్ క్లాస్ ఉండే చోట, ఇవి కడతారు. అంటే సామాజిక ఇబ్బందులు తలెత్తే అవకాసం ఉంటుంది. అందుకే భూమికి బదులు, ఎక్కువ మంది డబ్బు ఇవ్వటానికే ఇష్ట పడతారు. ఆర్ధిక కష్టాలలో ఉన్న ప్రభుత్వానికి, డబ్బు అవసరం కాబట్టి, చక్కగా ఈ రూపంలో డబ్బు అందుతుంది. ఈ ఐడియా ఎవరు ఇచ్చారో కానీ , అద్భుతం అనే చెప్పాలి. అయితే ఈ నిర్ణయం పైన, అసలు ఇది చట్టబద్దమా కాదా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశం పైన ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు ఏమి అంటుందో చూడాలి. అయినా ఇప్పుడు లేఅవుట్ లో వాటా అడిగే వారు, రేపు మన సంపాదనలో కూడా వాటా అడగరు అనే గ్యారంటీ ఏమిటి ? ఈ ధోరణి ఎక్కడి వరకు వెళ్తుందో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read