గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ మహనాడు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిస్థితులు చర్చించుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే ఇదే సందర్భంలో సొంత పార్టీలో జరుగుతున్న విషయాలు, కార్యకర్తల వాయిస్ వినిపించారు ముగ్గురు నేతలు. చంద్రబాబు ముందే అన్ని విషయాలు కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా, పిఆర్. మోహన్, చినరాజప్ప, గౌతు శిరీష, జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలతో అందరూ ఏకీభావించారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, " మనం 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం. పార్టీని బుత్ లెవెల్ వరకు, బలోపేతం చెయ్యాలి అని ఆనాడు చంద్రబాబు గారు చెప్తే, ఎవరూ పట్టించుకోలేదు. ఎంత మంది నేతలు పార్టీని విడిచి వెళ్ళినా క్యాడర్ లాగే ఉంది. వెళ్ళిన వారు అడ్డ్రెస్ లేకుండా పోయారు. కనీస గుర్తింపు లేకుండా పక్కన పడేసారు. ఓడిపోయిన తరువాత టిడిపిలో చాలా మంది నేతలు సైలెంట్ గా ఉన్నారు"
"అలా ఉండటం కరెక్ట్ కాదు. అందరూ కలిసి, పార్టీ పటిష్టతకు పని చెయ్యాలి. చంద్రబాబు గారు ఇవన్నీ గమనించి, పని చేసే వాళ్ళనే గుర్తించాలి. కార్యకర్తల పై పెడుతున్న కేసులను, నాయకులుగా అందరం అండగా నిలవాలి" అని చినరాజప్ప అన్నారు". ఇక జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, " కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, అప్పుల్లో ఉన్నా, కేసులు పెడుతున్నా అలాగే నిలబడి పోరాడుతున్నారని అన్నారు. ఎవరైనా పార్టీని వీడి వెళ్ళుతున్నారు అంటే, అది మీ నాయకత్వం గుర్తించకే అని, అది తెలిసిన రోజున మళ్ళీ వెనక్కు వస్తారు అని అన్నారు. ఇక గౌతు శిరీష మాట్లాడుతూ, " కార్యకర్తల మాటగా చెప్తున్నా అని :పార్టీని వీడుతున్న నాయకులను మళ్లీ పార్టీలో చేర్చుకోవద్దని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం" అని అన్నారు. మాజీ శాప్ చైర్మెన్ పిఆర్. మోహన్ మాట్లాడుతూ, చంద్రబాబుని ముంచుంది కొంత మంది అధికారులు అంటూ, నలుగురు పేర్లు చెప్పారు. సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వకుండా, కార్యకర్తలని కలవనివ్వకుండా వాళ్ళే మొత్తం చేసారని, చంద్రబాబు ఇలాంటివి గుర్తించి, వారిని దూరం పెట్టాలని అన్నారు.