కాంగ్రెస్ పార్టీకి చేతకానిది, మమతాకి చేతకానిది, చంద్రబాబు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి సెట్ చేసారు. మమత, కమ్యూనిస్ట్ లు, ఆప్, ఎన్సీపీ, ఫరుఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్, ఇలా అందరూ చంద్రబాబు వెంటే ఉన్నారు. దేశంలో వ్యవస్థలు నాశనం అవుతుంటే, అన్ని విపక్షాలని కలుపుకు వెళ్ళాల్సిన కాంగ్రెస్ వదిలేయటంతో, మోడీ-షా ని ఎదుర్కోవటానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ రోజు చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మహాకూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు చర్చలు చేపట్టారు. పర్యటనలో భాగంగా శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. పలు అంశాలపై మంతనాలు నిర్వహించారు. అనంతరం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడారు. సీబీఐ, ఆర్బీఐలలో ఏం జరుగుతోందో చర్చించామని తెలిపారు.

newdelhi 0112018 2

అలాగే సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామన్నారు. కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చామని తెలిపారు. శరద్‌పవర్‌ మాట్లాడుతూ.. సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులల్లో ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. శరద్‌పవార్, ఫరూక్ అబ్దుల్లా దేశంలోనే సీనియర్‌ నేతలు అని చెప్పారు. దేశంలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. సీనియర్‌ నాయకులుగా మేమంతా ఆందోళన చెందుతున్నామని స్పష్టం చేశారు. అందరం కలిసి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు, దేశాన్ని రక్షించడానికి పూనుకోవాలనుకున్నామని వివరించారు.

newdelhi 0112018 3

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా రాహుల్‌తో సమావేశమయ్యారు. రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనకు వీణను బహూకరించారు. దేశంలో భాజపాయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుపైనే ప్రధానంగా రాహుల్‌తో చర్చించారు. రాహుల్‌తో భేటీలో సీఎం చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read