మన రాష్ట్రంలో గత రెండేళ్ళలో పెట్టుబడులు ఎన్ని వచ్చాయి అంటే, గట్టిగా ఒక పేరు చెప్పటానికి లేదు. మన రాష్ట్రం నుంచి వేల్లిపోయినవి అయితే లూలు, అదానీ డేటా సెంటర్, రిలయన్స్ జియో, ఇలా చాలా చెప్పవచ్చు. అయితే ఏదో ఒక రూపంలో ఒక కంపెనీ ముందుకు వచ్చింది. దాదాపుగా ఏడాది పైనా అవుతున్నా, ఆ కంపెనీ ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్న సమయంలో, ఆ కంపెనీ దివాళా తీసింది అనే వార్త, అటు ఏపి ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అనేది, మన విభజన చట్టంలో ఒక అంశం. అన్ని హామీలు లాగే, ఇది కూడా కేంద్రం విస్మరించింది. దీని కోసం అప్పట్లో టిడిపి ఎంపీలు, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసారు. అయినా కేంద్రం దిగిరాక పోవటంతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రమే కడప స్టీల్ కుడుతుందని ప్రకటించి, భూమి పూజ కూడా చేసారు. అయితే ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం, జగన్ మోహన్ రెడ్డి మారటంతో, మొత్తం రివర్స్ అయ్యింది. అన్ని ప్రాజెక్ట్ లు లాగానే, ఇది కూడా చెల్లికి మళ్ళీ పెళ్లి కాన్సెప్ట్ లో, జగన్ మోహన్ రెడ్డి, మళ్ళీ భూమి పూజ చేసారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ కాకుండా, బ్రిటన్ కు చెందిన లిబర్టీ స్టీల్స్‌ ని తీసుకుని వచ్చారు. సరేలే ఏదో ఒకటి, ప్రైవేటు కంపెనీ అయితే ఏమిలే, ఏదో ఒకటి పెట్టుబడి వస్తుంది కదా అని అందరూ అనుకున్నారు.

liberty 30032021 2

అయితే ఏడాది దాటినా ఇంకా పరిశ్రమ లేదు, ఏమి లేదు. వీళ్ళు ఎప్పుడు అడుగు పెడతారా అని భావిస్తున్న సమయంలో, పిడిగు లాంటి వార్త బ్రిటన్ నుంచి వినిపిస్తుంది. అదే లిబర్టీ స్టీల్స్ దివాళా తీసింది అనే వార్త. అదేంటి, ఏడాది లోపే ఈ కంపెనీ దివాళా తీస్తుందని తెలిసినా, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఆ కంపెనీతో ఎలా పెట్టుబడి పెట్టించాలని అనుకున్నది అనుకుంటే, దానికి సమాధానం లేదనే చెప్పాలి. ఈ కంపెనీ దివాళా తీసిందనే వార్తలు రావటంతో, ఈ కంపెనీని ఎలా వదిలించుకోవాలి అనే పనిలో వైసీపీ ప్రభుత్వం పడింది. వెంటనే బ్రిటన్ లోని ఇండియన్ ఎంబసీకి లేఖ రాసి, మొత్తం నివేదిక పంపించాలని కోరింది. దీని పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే లిబర్టీ గ్రూప్, బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరగా, బ్రిటన్ ప్రభుత్వం కూడా, మేము ఏమి చేయలేం అని చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా, ఏదో ఒక కంపెనీ వస్తుంది, అదీ రాయలసీమలో వస్తుందని సంతోష పెడుతున్న ప్రజలకు, చివరకు అది ఒక దివాళా కంపెనీ అని తెలియటంతో, నిరాసకు గురయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read