అనుకున్నదే తడవుగా, ప్రజా వేదికను రాత్రికి రాత్రి కూల్చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధమని, రాత్రికి రాత్రి కూల్చేసారు. అయితే ప్రజా వేదిక తరువాత, చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూడా టార్గెట్ చేసారు. చంద్రబాబు ప్రస్తుతం, ఉండవల్లి లోని లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. అయితే అది కూడా అక్రమం అని, దాన్ని కూడా కుల్చేస్తామని, గత వరం నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని సీఆర్డీయే అధికారులు, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి ముందు నోటీస్ అంటించి వెళ్లారు. అయితే ఈ నోటీస్ కు, మొన్న శుక్రవారం, లింగమనేని రమేష్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. లింగమనేని రమేష్ ఇచ్చిన సమాధానంలో ప్రధానంగా, మూడు అంశాలు ప్రస్తావిస్తూ, అన్ని అంశాల పై, డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తూ, సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది.
అందులో మొదటిది, ఉండవల్లి గ్రామ పంచాయతీ నుంచి భవన నిర్మాణం కోసం గతంలోనే అనుమతులు పొందామని ఆ వివరాలు చెప్పినట్టు సమాచారం. రెండవది, బీపీఎస్ (భవన క్రమబద్ధీకరణ పథకం) కింద ఈ భవనం రెగ్యులరైజేషన్ చెయ్యమని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నట్టు తెలిసింది. ఇక మూడవది, నిబంధనల ప్రకారం తమకు నోటీసులు ఇచ్చే అధికారం లేని అధికారులు వాటిని అందజేశారని చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ భవనంలో నివాసం ఉండటం కోసం అడిగారని, ఆయన పై ఉన్న గౌరవంతో ఆ రోజు ఆయనకు భవనం ఇచ్చామని, ఇందులో రాద్ధాంతం చెయ్యటానికి ఏమి లేదని చెప్పినట్టు తెలిసింది. ఈ అంశాల పై సీఆర్డీయే ఉన్నతాధికారులను పర్సనల్ గా వచ్చియా కలుస్తానాని, మరింత వివరణ ఇవ్వాల్సి ఉందని, దాని కోసం సీఆర్డీయే ఉన్నతాధికారుల అపాయింట్మెంట్ ఇవ్వమని కోరినట్టు రమేష్ అడిగినట్టు సమాచారం.