రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఐఎంఎఫ్ లిక్కర్, విదేశీ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై కొంత మేర ధర తగ్గించింది. అలాగే 90ఎంఎల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యం ధరలను పెంచింది. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం మద్యం ధరలను స్వల్పంగా తగ్గించడంతో మందు బాబులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైన్‌షాపులపై మందు కోసం ఎగబడుతున్నారు. మందు బాబులు మద్యం కోసం శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచే ప్రభుత్వ వైన్‌షాపుల వద్ద బారులు తీశారు. గుంటూరు అరండల్‌పేట 1వ లైనులోని ప్రభుత్వ వైన్ షాపు పరిసర ప్రాంతాలు మందు బాబులతో కోలాహల వాతావరణం ఏర్పడింది. ఉదయం ఇంటి పనులపై పాల ప్యాకెట్లు, కూరగాయలు, కుటుంబ అవసరాలకు సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళేందుకు వచ్చిన వారు కూడా ప్రభుత్వ వైన్ షాపుల వద్దే బారులు తీరి తమ సమయం కాస్త ప్రభుత్వ వైన్ షాపుల వద్దే కొందరు వెళ్ళబుచ్చారు.
కో-వి-డ్ నేపథ్యంలో మందు చుక్క దొరక్క అల్లాడి పోయామని, అదీకాక క్వార్టర్ బాటిల్ ధర భారీగా విక్రయించడం వల్ల మందు త్రాగలేక పోయామని పలువురు మందు బాబులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మద్యం ధరలను తగ్గించటంతో తెల్లారే సరికే మద్యం కొనుగోలుకు ప్రభుత్వ వైన్ షాపుల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరి గంటల కొద్దీ వేచి ఉండడం విశేషం. మరి కొందరైతే ఆటోల్లో, ద్విచక్ర వాహనాలలో వచ్చి రోడ్ల వెంట గంటల కొద్దీ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండడంతో వారిని క్రమబద్దీకరించే నాధుడు లేక పోవడంతో అటు పాదచారులకు ఇటు వాహన చోదకులు పలు ఇబ్బంలకు గురికావాల్సి వస్తోందని నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం, బ్రాండుల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందని అంటున్నారు.ఏదో తగ్గించాం అంటున్నారని, గతంలో కంటే 100 శాతం పెంచి, పెంచిన దాని పై 20,30 రూపాయలు తగ్గించారని, ఇక్కడకు వస్తేనే తెలిసిందని, ఏదో పేరుకు తప్ప తగ్గించామని చెప్పి, అవే ఊరు పేరు లేని బ్రాండులు అమ్ముతున్నారని వాపోతున్నారు. మొత్తానికి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తరువాత, అన్ని విషయాల్లో పెరిగే రేట్లే కానీ, తగ్గే రేట్లు మాత్రం మద్యం ఒక్కటే అనుకుంటా...