తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో నిన్న హ-త్య కు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించటానికి నారా లోకేష్ ఈ రోజు వచ్చాయి. అయితే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఉదయం నుంచి అక్కడ హైడ్రామా నడుస్తుంది. లోకేష్ రాక ముందే అక్కడ నుంచి రమ్య మృతదేహాన్ని తరలించటానికి ఏర్పాట్లు చేసారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, దళిత సంఘాలు నిరసన తెలిపాయి. నిందితుడిని చం-పే-యా-ల-ని , కోటి రూపాయల పరిహారం కావాలని డిమాండ్ చేసారు. అయితే ఇదే సమయంలో హోం మంత్రి అక్కడకు వచ్చి పది లక్షల చెక్ ఇచ్చారు. అక్కడ కూడా ఆందోళన రేగింది. పది లక్షలు ఇచ్చి చేతులు దులుపు కోవటం కాదని నిరసన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో లోకేష్ అక్కడకు వస్తున్నారని తెలుసుకుని, గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి, మృతదేహాన్ని వెనుక గేటు నుంచి తరలించారు. మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించారు. దీంతో నారా లోకేష్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి, అక్కడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక ఇదే సమయంలో నీచ రాజకీయానికి తెర లేపింది వైసిపీ. అక్కడకు వచ్చి గొడవ చేసింది.
దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసారు. అక్కడ ఉన్న టిడిపి నేతలను ఇష్టం వచ్చినట్టు ఈడ్చి పడేసారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పై చేయి చేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న ఇతర నేతలను ఈడ్చి అవతల పడేసారు. నారా లోకేష్ ని ఆడుపులోకి తీసుకుని, పోలీస్ జీప్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అయితే ఎక్కడకు తీసుకుని వెళ్తున్నారో చెప్పక పోవటంతో, తీవ్ర ఆందోళన నెలకొంది. చివరకు నారా లోకేష్ ని పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి అయన్ను అరెస్ట్ చూపిస్తారా, లేదా వదిలేస్తారా అనేది ఇంకా తెలియదు. అయితే పోలీసులు తీరు పై టిడిపి నేతలు మండి పడుతున్నారు. ఒక దళిత మహిళకు న్యాయం చేయమని అడగటం కూడా నేరమా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే లోకేష్ ని విడుదల చేయాలని, ఆ యువతికి న్యాయం చేసి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఇలా పిరికి వాడిలా ఉంటున్నారో అర్ధం కావటం లేదని అంటున్నారు.