టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చారు. ఉదయం నుంచి ఈ విషయంలో హైడ్రామా నడిచింది. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు లోకేష్ చేరుకున్న దగ్గర నుంచి, మొత్తం ప్లాన్ ప్రకారం పోలీసులు నడిపించారు. ముందుగా లోకేష్ తాను 9 గంటలకు గన్నవరం వస్తానని చెప్పారు, తరువాత 11.45 నిమిషాలకు షడ్యుల్ మారింది. దీంతో పోలీసులు కూడా వ్యూహం మార్చారు. అయితే ముందుగా లోకేష్ ని ఎయిర్ పోర్ట్ లోనే నిర్బందించి, తరువాత ఫ్లైట్ లో హైదరాబాద్ పంపించి వేయాలని ప్లాన్ చేసారు. అయితే రాత్రి తొమ్మిది గంటల వరకు మరే ఫ్లైట్ కూడా హైదరాబాద్ కు లేకపోవటంతో, పోలీసులు వ్యూహం మార్చారు. లోకేష్ ని అరెస్ట్ చేస్తారని ఒకసారి, లోకేష్ ని అదుపులోకి తీసుకుని, సాయంత్రం వరకు స్టేషన్ లో ఉంచుతారని ఒకసారి, అలాగే లోకేష్ ని పార్టీ ఆఫీస్ కు తీసుకు వెళ్తారని ఒకసారి, లోకేష్ ని ఉండవల్లిలోని ఇంటికి తీసుకుని వెళ్తారని ఒకసారి, ఇలా రకరకాల కారణాలు చెప్పారు. ముందుగా లోకేష్ ఎయిర్ పోర్ట్ లోకి రాగానే, ఆయన పక్కన ఉన్న నేతలను అదుపులోకి తీసుకున్నారు. తరువాత లోకేష్ ని సొంత వెహికల్ లో ఎక్కించారు. ఆ వెహికల్ ని పోలీసులు కంట్రోల్ లోకి తీసుకున్, తాము చెప్పినట్టు రావాలని కోరారు.

notice 09092021 2

దీంతో లోకేష్ ని ముందుగా గుడివాడ వైపు ఉన్న నందివాడ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారని అందరూ భావించారు. అయితే మళ్ళీ కాన్వాయ్ ని విజయవాడ వైపు మళ్ళించారు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో చెప్పలేదు. దీంతో లోకేష్ కూడా సమయం కోసం ఎదురు చూసారు. కృష్ణలంక వద్దకు రాగానే తన వాహనాన్ని ఆపించి, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని నిలదీశారు. తాము ఉండవల్లి తీసుకుని వెళ్తున్నామని చెప్పటంతో, లోకేష్ ఆగ్రహించారు. తాను నరసరావుపేట వెళ్ళాల్సిందే అని చెప్పారు. పోలీసులు ఎందుకు ఆపుతున్నారు, నన్ను ఏ సెక్షన్ కింద నిర్బందించారో చెప్పాలని కోరగా, చివరకు లోకేష్ ఒత్తిడికి తలొగ్గి, 41 ఏ నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీస్ లో ఏముందా అని చూస్తే, మీరు హైవే పై బండి ఆపి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు అని ఉంది. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఒక పక్క ఉదయం నుంచి ఏదో ఉ-గ్ర-వా-దిని పట్టుకున్నట్టు పట్టుకుని, చివరకు నోటీస్ ఇలా ఇవ్వటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read