వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పెంచిన పన్నులు, సర్ చార్జీలతో దేశంలోనే అతి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కువయ్యాయి. దీంతో పక్క రాష్ట్రాలు తమ సరిహద్దులో బోర్డులు కూడా పెట్టాయి. ఏపీ కంటే పెట్రోల్ మా వద్ద 11 రూపాయలు తక్కువ, డీజిల్ 15 తక్కువ అంటూ ఊరిస్తూ..తమిళనాడు, కర్ణాటక సరిహద్దు బంకుల్లో బోర్డులు దర్శనమిస్తున్నాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ కర్ణాటక సరిహద్దు గ్రామాల మీదుగా వెళ్లేటప్పుడు అక్కడి బంకుల్లో తమ కాన్వాయ్ వాహనాలకు పెట్రోల్ , డీజిల్ కొట్టించి ఏపీ కంటే కర్ణాటకలో ఎంత తక్కువో ధరలని చూపించాడు. మరోసారి ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఎక్కువో, జగన్ బాదుడే బాదుడు ఏ రేంజులో ఉందో లైవ్ లో చూపించారు నారా లోకేష్. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోనే పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలున్నాయని విష ప్రచారం చేశారు జగన్. 2019లో అధికారం చేజిక్కించుకున్న జగన్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజీల్ ధరలు హయ్యస్ట్ చేసి రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని నారా లోకేష్ తన పాదయాత్రలో ఎండగడుతున్నారు. మొన్న కర్ణాటకలో తన వాహనానికి డీజిల్ నింపుకుని ధరల వ్యత్యాసాన్ని ప్రజలకు చూపించారు. ఈ రోజు చిత్తూరు పట్టణంలో పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్ రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకు దగ్గర ఆగారు. అక్కడ ఉన్న ధరల పట్టికను చూపిస్తూ మరోసారి డీజిల్, పెట్రోల్ ధరల రూపంలో జగన్ రెడ్డి దోపిడీని ప్రజలకు తెలియజెప్పారు.
జగన్ బాదుడే బాదుడుని జనానికి లైవ్ గా చూపిస్తోన్న నారా లోకేష్
Advertisements