కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పలు మార్గ దర్శకాలతో ఆంధ్రప్రదేశ్ లోను ఈ నెల 30వరకు లాక్ డౌనను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు లను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా శనివారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ మార్గ దర్శకాలు అమల్లోకి వస్తాయి. వీటిని అనుసరించకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లును తెరుచుకునేందుకు అనుమతినిస్తుంది. అయితే కచ్చితంగా ఇవి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వనిచి చేయాలి. ఆహారాన్ని ఇక్కడ నుంచి పార్శిల్ గా తీసుకుని వెళ్లేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్ళు పైబడిన వారు, 10 ఏళ్ళలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేదం అమలులో ఉంటుంది. అటువంటి వారిపై రూ. 1000వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని ప్రాంతాల్లోను అమలు చేయాలి, కీలకంగా షాపింగ్ మాల్స్ లో ఎయిర్ కండిషన్ 24డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.

అనుమతి వున్న షాపింగ్ మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు యాజమాన్యాలు డిజిటల్ చెల్లింవులు, ఈ-వ్యాలెట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. షాపింగ్ మాల్స్ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియం త్రణ చర్యలు చేపట్టాల్సి వుంటుంది. పుడ్ కోర్టు లు, రెస్టారెంటుల్లో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. అంతేకాకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాల్సి వుంది. హోటళ్ళలో, రెస్టారెంట్లులోని టేబుళ్ళు, కుర్చీలు వినియోగదారులు మారిన ప్రతి వర్యాయం శానిటైజ్ చేయాల్సివుంటుంది. గేమింగ్, ఇతర ఎంటరైన్మెంటు ప్రాంతాలను ప్రభుత్వం తదువరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు మూసివేయాలి. ఎట్టి పరిస్థితుల్లో షాపింగ్ మాల్స్ లోని సినిమాహాళ్లను తెరవకూడదన్నారు. దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో పాటించాల్సిన నిబంధనలు, కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లోకి భక్తులను అనుమతిస్తుంది, అయితే రెండు రోజుల పాటు ట్రైల్ రన్స్ ను నిర్వహించిన తరువాతనే అందుకు అనుమతిస్తుంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేసారు. 10వతేదినుంచి ఆలమాల్లోకి భక్తులను అను మతిస్తామని స్పష్టం చేసారు.

ఆయా ఆలయాలు ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ భక్తులు ఆలయాల్లోకి వెళ్ళాలి. ఇదే రీతిలో అన్ని ధార్మిక ప్రదేశాల్లోకి నిబంధనలకు అనుగుణంగానే భక్తులు భౌతిక దూరం పాటిస్తూ వెళ్ళాల్సి వుంటుంది. ధార్మిక ప్రదేశాల్లో భక్తులు గుమికూడదు. కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి,మాస్కులు ధరిం చాలి. శానిటైజర్లు కలిగివుండాలి. దేవాలయాల్లోకి ప్రవేశించే సందర్భంలో కచ్చితంగా వరుస క్రమ యాజమాన్యాన్ని నిర్వహించాలి. భక్తులకు తీర్థ ప్రసాదాలను, ఇవ్వడం వారిపై పవిత్రజలాలు చల్లడం చేయకూడదు, దేవాలయాల్లో విగ్రహాలు, పవిత్ర గ్రంధాలను తాకకుండా దర్శనం చేసుకోవాల్సివుంటుంది. ప్రార్థనా మందిరాల్లో సాముహిక ప్రవేశాలు జరుగకూడదు. సరైన భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు అన్నదానం చేయాల్సి వుంటుంది. ఆయా మందిరాల నిర్వా హకుల ఖచ్చితంగా భక్తులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. నేలపై కూర్చుని ప్రార్థనలు చేసుకునే వారు ఎవ్వరికి వారు కింద కూర్చునే వస్త్రం/తివాచీని తీసుకుని రావాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read