గిరిజనుల విలువైన సంపదను రెడ్డి బ్రదర్స్ కొల్లగొడుతున్నారని, ఆ వ్యవహారంపై ప్రశ్నిస్తున్న వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, గిరిజనుల భూములను ఆక్రమించు కుంటున్నారని, గిరిపుత్రుల సమస్యలు, బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన తమను అకారణంగా అడ్డుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం ఆమె తనని వాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "బాక్సైట్ ఖనిజ సంపద అక్రమ మైనింగ్ గురించి, గిరిజనుల సమస్యల గురించి తెలుసుకునే హక్కు ఒక గిరిజన బిడ్డగా నాకులేదా? రక్షణపేరుతో పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడ మేంటి? కో-వి-డ్ నిబంధనలు ఉల్లంఘించామనే కుంటి సాకు చూపి తమను అరెస్ట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిఇన్నేళ్లైనా ఈ ప్రభుత్వం ఇంకా అక్రమ అరెస్ట్ లకు పాల్పడుతోంది. గిరిజనుల సమస్యలను, అటవీ భూమిలో యథేచ్ఛగా సాగుతున్న మైనింగ్ వ్యవహారాన్ని లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లాలని తాము భావించాము. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లకుండా గిరిజనులను ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి. తమను అకారణంగా అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా అరెస్ట్ చేయడంపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. "

reddy 19072021 2

"గిరిజనుల సంపదను కొల్లగొట్టే క్రమంలో రెడ్డి బ్రదర్స్ చేయాల్సిన దారుణాలన్నీ చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో రూ.90లక్షలతో భారీ రోడ్డు వేశారు. ఆ రోడ్డు ద్వారానే విలువైన ఖనిజ సంపదను రెడ్డిబ్రదర్స్ దోచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి, గిరిజనుల గోడు వినడానికి వెళ్లిన తనతో పాటు,ఇతర బీసీ నేతలను ఎలా అడ్డుకుంటారు? స్వాతంత్ర్య భారత దేశంలో మాట్లాడేహక్కు, జీవించే హక్కుని హరిస్తూ, పోలీసుల సాయంతో ఎన్నాళ్లు అడ్డుకుంటారు? గిరిజన మహిళగా గిరిజనుల వద్దకెళ్లే అధికారం, హక్కు తనకున్నాయి. తన హక్కులను నిర్వీర్యం చేస్తూ, తనను పోలీసులు అడ్డుకున్నతీరుపై లోకాయుక్త దృష్టికి తీసుకెళ్తాను. న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడతాను." అని ఆమె అన్నారు. 15 వేల కోట్ల బాక్సైట్ మైనింగ్ జరుగుతుందని టిడిపి ఆరోపిస్తూ, కొన్ని ఆధారాలు బయట పెట్టింది. అలాగే బాక్సైట్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని టిడిపి సందర్శించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read