70వేల మందికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎలా సాయం చేసారో చూసారా... దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని రికార్డు ఇది.... ఎప్పుడూ అభివృద్ధి, టెక్నాలజీ అనే మూడ్ లో ఉన్న చంద్రబాబు, కష్టం అని వచ్చిన పేదవారిని ఎలా ఆదుకున్నారో చూడండి.. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, సియం రిలీఫ్ ఫండ్ నుంచి, పెద్దగా నిధులు ఇచ్చే వారు కాదు... అప్పట్లో ఆయన వర్కింగ్ స్టైల్ వేరు.... కాని, ఇప్పటి చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు... కష్టం అని ఎవరు వచ్చినా, దాంట్లో నిజా నిజాలు తెలుసుకుని, ఎంత సహయమ కావాలి అంటే అంత చేస్తున్నారు... అంతే కాదు టీవీల్లో వచ్చే వార్తలు కూడా చూసి, వారికి సహాయం చేస్తున్నారు.... ఇటీవల మంత్రి నారా లోకేశ్‌కు ఎదురైన ఓ అనుభవం ఆయననే కాదు.. పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

lokesh 30072018 2

ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గ్రామదర్శినిలో భాగంగా ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుమీద వెళుతుండగా సుమారు 70 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి వచ్చి గట్టిగా లోకేశ్‌ చేయిని పట్టుకున్నారు. వదిలించుకోవడానికి కూడా వీలులేని విధంగా చేతిని పట్టుకోవడంతో లోకేశ్‌ బిత్తరపోయారు. అనుకోని ఈ పరిణామానికి లోకేశ్‌ భద్రతాసిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా తేరుకున్న లోకేశ్‌ ఆ పెద్దాయన నుంచి తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ 'మీకేం కావాలి పెద్దాయన' అని అడిగారు.

lokesh 30072018 3

ఆయన లోకేశ్ చేతిని వదలకుండానే 'బాబు.. నాకు ఆరోగ్యం బాగాలేదని మీ నాన్న దగ్గరకు వచ్చాం.. లివర్‌ను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలని వైద్యులు చెప్పారు. అదే విషయాన్ని మీ నాన్నకు చెబితే ఆయన నాకు చెక్‌ ఇచ్చారు. ఆసుపత్రికి నేరుగా డబ్బులు వెళ్లాయి.. లివర్‌ మార్చారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. 'నువ్వు కూడా అలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా... నేను బతికున్నంతకాలం మీ నాన్నకు రుణపడి ఉంటాను' అని చెప్పడంతో లోకేశ్‌కు కాసేపు నోటి వెంట మాట రాలేదు.. ప్రజా జీవితంలో ఇంతకంటే సంతృప్తి ఏం కావాలని లోకేశ్‌ తన అనుచరులతో వ్యాఖ్యానించారు. చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఈ సంఘటన గుర్తు చేసిందన్నారు. సాయం అందుకున్న వారి మోముల్లోని ఆనందానికి.. వారు చెప్పే కృతజ్ఞతలకు వెల కట్టగలమా? ఎన్ని కోట్లు ఇచ్చినా.. ఎంతటి అత్యున్నత పదవిని అధిరోహించినా ఆ ఆనందానికి సరిరాదు అంటూ లోకేష్ సహచరులతో చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read