ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ట్విట్టర్ లో ఒక ప్రశ్న వేసారు. "చంద్రబాబుగారూ @ncbn .. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటంకాని, ఒక ఉద్యమంకాని ఎప్పుడైనా చేశారా?" అంటూ ప్రశ్న వేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా జగన్ చేసిన ఆరోపణల పై లోకేష్ కౌంటర్ ఇచ్చారు. "నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసారు. కానీ అన్నిటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పోరాటం ముఖ్యమైనది. అది మీ నాన్న గారి అవినీతి పై చేసిన పోరాటం. మీ దురాశతో చేసిన అవినీతి, క్విడ్ ప్రో కో డీల్స్,హత్యా రాజకీయాలు,దోపిడీలు,కిడ్నాప్ లు,భూ కబ్జాలు,జైల్లో హత్యలు ఇలా అనేక విషయాల పై పోరాటం చేసారు...ఆయన చేసిన పోరాటం మీకు ఇప్పుడు గుర్తు వస్తుందా...? అంటూ ఆదరిపోయే పంచ్ ఇచ్చారు.
ఇది లోకేష్ ట్వీట్ "In 40yrs of his political journey, @ncbn has led many a movement for people, but the most noteworthy of them all were against your father's corruption fuelled by your greed, quid-pro-quo deals, murders, extortions, kidnappings, land grabbing, prison killings... remember now? ... అయితే జగన్ చేసిన ట్వీట్ ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. చంద్రబాబు ఎన్ని పోరాటాలు చేసారో అందరూ చూసారు కూడా. బాబ్లీ ప్రాజెక్ట్ పై పోరాడుతూ, మహరాష్ట్ర పోలీసుల చేత దెబ్బులు కూడా తిన్నారు. విభజన సమయంలో, 60 ఏళ్ళ వయసులో 7 రోజులు నిరాహార దీక్ష చేసారు. ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఇదే ప్రశ్న జగన్ ను వేస్తే ఏమి చెప్తారు ? ఎంపీగా, నాలుగేళ్ళు ఎమ్మల్యేగా, ప్రతిపక్ష నాయకుడుగా, జగన్ ఇప్పటి వరకు చేసిన ఒక్క పని అయినా ఉందా ? ఇలాంటి వారికి ఛాలెంజ్ లు ఎందుకు చెప్పండి? లేపి మరీ తిన్నించుకోవటం కాకపోతే...