స్వాతంత్ర్య దినోత్సవం నాడు గుంటూరులో రమ్య అనే యువతి దారుణ హ-త్య-కు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించటానికి, టిడిపి జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేష్, బాధితురాలి ఇంటికి వెళ్ళారు. అయితే లోకేష్ పరామర్శించి, ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. అలా కాకుండా, లోకేష్ వచ్చిన సమయంలో, అక్కడకు వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు, ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వైసీపీ వారిని ఏమి చేయకుండా, అక్కడకు వచ్చిన టిడిపి నేతలను అరెస్ట్ చేసారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. పొలిటికల్ కేరీర్ లోనే మొదటి సారిగా లోకేష్ ని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ లో పెట్టారు. సాయంత్రం వరకు వదిలి పెట్టకుండా, సాయంత్రం అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పి, చివరకు నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇది ఇలా ఉంటే అసలు లోకేష్ పై ఏమి కేసు పెట్టారు ? ఆయన కేవలం పరామర్శ కోసమే కదా వెళ్ళింది, పరామర్శకు వెళ్ళిన వ్యక్తి పై ఎలాంటి కేసు పెట్టి, అరెస్ట్ చేసారు ? విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని నోటీసులో సంతకం పెట్టించుకుని మరీ ఎందుకు పంపిచారు ? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే లోకేష్ పైన పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది.
అందులో కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. అవి చూసిన టిడిపి శ్రేణులు ఆశ్చర్యపోయారు. లోకేష్ పై 448 నెంబర్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఈ కేసులో లోకేష్ ని ఏ1గా చూపించారు. సరే ఇక ఏమి అభియోగాలు పెట్టారు అంటే, అక్కడ ఉన్న ఉద్యోగుల విధులకు నారా లోకేష్ ఆటంకం కలిగించారు అంట. అంతే కాదు కుట్రపూరితంగా మా-ర-ణా-యు-ధా-ల-ను ధరించి వచ్చారు అంటూ, కొన్ని సెక్షన్లు పెట్టి, ఆయన పై అభియోగాలు మోపారు. ఇక ఇదే కేసులో, ఇతర టిడిపి నేతలు కూడా ఉన్నారు. మాజీ మంత్రులు పత్తిపాటి, నక్కా ఉన్నారు. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. మొత్తం 32 మంది పై కేసులు నమోదు చేసారు. వీరి పై 341, 353, 147రెడ్‌విత్ 149 రెడ్‌విత్ 120బీ అనే అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇక అలాగే మరో కేసు వచ్చి, గుంటూరు హాస్పిటల్ దగ్గర రమ్య మృతదేహం ఉన్న అంబులెన్స్ ని వెళ్ళనివ్వలేదు అంటూ మరి కొంత మంది కూడా కేసు పెట్టారు. అయితే అసలు లోకేష్ ఎక్కడ కుట్ర చేసారు, ఎక్కడ ఉద్యోగులను అడ్డుకున్నారు అంటూ టిడిపి శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.