అబద్ధాలతో పెట్రేగి పోయే, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, మరో సారి తన అబద్ధాలతో, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసాడు. నిన్న జీవీఎల్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, తనకు కమీషన్లు వచ్చే అభివృద్ధి పనులకు మాత్రమే అంగీకారం తెలుపుతున్నారని ఆరోపించారు. టీడీపీతో కలిసి ఉండడం వల్ల రాష్ట్రంలో తమ పార్టీ చాలా కోల్పోయిందని అన్నారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్ బ్రోకర్లను ఏదో ఒక పని పేరుతో తరచూ తన వద్దకు పంపవద్దంటూ ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు స్వయంగా చెప్పారంటే రాష్ట్రంలో అవినీతి విలయ తాండవాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సొంత పనుల కోసం వచ్చే బ్రోకర్లను తన వద్దకు పంపవద్దని లోకేశ్‌కు కేంద్ర మంత్రి చెప్పారని గుర్తుచేశారు.
అయితే, జీవీఎల్ చెప్పిన అబద్ధాల పై, లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. జీవీఎల్ నరసింహారావుకు సవాల్ విసిరారు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ట్విట్టర్ వేదికగా కోరారు. కేంద్రమంత్రి దగ్గరకు బ్రోకర్‌ను పంపానంటున్న జీవీఎల్... ఆ కేంద్రమంత్రి పేరు, బ్రోకర్ పేరును బయటపెట్టాలన్నారు. సహజంగా మనుషులు రెండు రకాలు ఉంటారని, ఒకటి నిజాలు చెప్పే వారు అయితే, అబద్ధాలను నిజమని నమ్మించే వారని అన్నారు. జీవీఎల్, అబద్ధాలను నిజమని నమ్మించే రకమని మండిపడ్డారు. . ఢిల్లీలో లాబీయింగ్ అంటూ మరో కట్టుకథ మొదలుపెట్టారని విమర్శించారు. అసత్యాలను ప్రచారం చేయడం బీజేపీ నేతలకు జబ్బుగా మారిందని లోకేశ్ ఎద్దేవా చేశారు.
మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. నారా లోకేశ్ ఈ విషయం పై కూడా ట్విట్టర్ లో స్పందించారు. సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్లో ఏపీకి ఏమీ ఇవ్వబోమని పేర్కొన్నారని, ఇది ద్రోహం, వంచనేనని అన్నారు. కాంగ్రెస్ ఏపీ ప్రజల నడ్డి విరిస్తే, బీజేపీ నమ్మకద్రోహం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి మర్చిపోలేని గుణపాఠం చెబుతారని అన్నారు. బీజేపీ సిగ్గుపడాలని పేర్కొన్నారు.