పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలంలో, ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు... చంద్రబాబు పెద్ద దొంగ అని, 420 అని, అవినీతిలో రాష్ట్రాన్ని నెంబరు-1 లో నిలిపారు అంటూ, అబద్ధపు ప్రచారం చేసారు జగన్. 2016లోనే మనరాష్ట్రం అవినీతిలో మొదటి స్థానంలో నిలిచిందంటూ, తప్పుడు ఆరోపణలు చేసారు. నిజానికి మన రాష్ట్రంలో అవినీతి తగ్గింది అని, మొన్నే ఒక కేంద్ర సంస్థ చేసిన సర్వేలో తేలింది. అంతే కాదు రాష్ట్రంలో అసలు శాంతి బధ్రతలు లేవని, మర్డర్ లు పెరిగాయని, అత్యాచార ఘటనలు పెరిగాయని, ఇలా నోటికి ఏది వస్తే అది, తన సాక్షి పేపర్ లో రోజు వచ్చే తప్పుడు వార్తలు లాగా, ఇష్టం వచ్చినట్టు చెప్పేసాడు జగన్...
దీని పై ఐటి శాఖ మంత్రి లోకేష్, ట్విట్టర్ లో, జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. 13 కేసుల్లో ఏ1గా ఉండి కండిషనల్ బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్.. ఏపీలో నేరాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా ఘనత వహించిన వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవాచేశారు. కిడ్నాపర్లు, బెట్టింగ్ రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, భూకబ్జాదారులు, అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులు ఉన్న పార్టీకి జగన్ అధినేత అంటూ మండిపడ్డారు. వైఎస్ హయాంలో జరిగిన నేరాల గురించి జగన్‌కు తెలియదా అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడింది సీఎం చంద్రబాబేనని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా జగన్ పై విరుచుకు పడ్డారు... సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం జమ్మాదేవిపేటలో గ్రామదర్శినిలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేతలు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. కష్టపడి చేసింది శాశ్వతమని, అవినీతితో సంపాదించింది అశాశ్వతమని చంద్రబాబు అన్నారు. ధర్మంగా సంపాదించాలని హితవు పలికారు. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు నవనిర్మాణ దీక్ష చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జూన్ 2న తెలంగాణలో ఉత్సవాలు చేసుకున్నారు, కాని మనం చేసుకోవడానికి వీల్లేదని.. మనం నష్టం పోయాం.. ఐదుకోట్ల ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష చేశానని చెప్పారు.