పెగాసెస్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి, దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ పై నిఘా పెట్టటానికి, తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. కేంద్రం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, నిన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు, మన రాష్ట్రంలో కూడా చర్చకు దారి తీసాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలి అంటూ, తనకు నాలుగేళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని, అయితే దానికి తాను ఒప్పుకోలేదని, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ సియంగా ఉన్న చంద్రబాబు, దాన్ని కొనుగోలు చేసినట్టు తమకు సమాచారం ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నిన్న ప్రముఖంగా పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యల పైన నారా లోకేష్ స్పందించారు. నిన్న మాండాలి వాయిదా పడిన తరువాత, లోకేష్ విలేఖరులతో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ఇలాంటి చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు టిడిపి ఎప్పుడూ చేయదని అన్నారు.

lokesh 18032022 2

ఒక వేళ తాము కనుక పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే, అసలు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉండేవారా అని లోకేష్ ప్రశ్నించారు. ఒక వేళ మేము కనుక పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి అసలు మమ్మల్ని వదిలి పెట్టే వారా ? మూడేళ్ళ నుంచి జగన్ రెడ్డి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచే వారా అని లోకేష్ ఎదురు ప్రశ్నించారు. టిడిపి ఏమి తప్పులు చేసిందో చెప్పండి అంటూ, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి వాడుకుని, మొత్తం అన్ని శాఖలు తనిఖీ చేయించారని, మేము పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే బయట పాడేది కదా ఆని అన్నారు. మమతా బెనర్జీ నిజంగా ఆ కామెంట్ చేసి ఉంటే కనుక, ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని, లోకేష్ అన్నారు. వ్యవస్థలను నమ్మి, అవే శాస్వతం అని నమ్మే వ్యక్తి చంద్రబాబు గారని, చంద్రబాబు ఎప్పుడూ చట్ట వ్యతిరేకత పనులు చేయరని, అందుకే 40 ఏళ్ళు, ఆయనను ఎవరూ ఏమి చేయలేక పోయారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read