హైదరాబాద్ నుంచి వచ్చి, గుంటూరులో సభ పెట్టి, మళ్ళీ హైదరాబాద్ చెక్కేసిన పవన్ కళ్యాణ్, మొన్న మీటింగ్ లో చేసిన ఆరోపణల పై మంత్రి నారా లోకే్శ్ స్పందించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా అమరావతిలో ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతుంటే, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి హైదరాబాద్‌లో కూర్చున్న వారికి ఏం తెలుస్తుందని అని లోకేష్ అన్నారు... చంద్రబాబుకు రెండున్నర మార్కులు ఇవ్వడానికి పవన్ ఎవరు, హైదరాబాద్‌లో ఉండేవారికి చంద్రబాబు పడే కష్టం ఏం తెలుస్తుంది? అంటూ పవన్ పై మండి పడ్డారు.... కేరాఫ్ రాజధాని లేని రాష్ట్రానికి ఒక రూపు తీసుకువచ్చింది ఎవరు? 8 శాతం ఉన్న వృద్ధిరేటును 12 శాతానికి తీసుకువచ్చింది ఎవరు? అంటూ చంద్రబాబు పరిపాలన పై పవన్ చేసిన విమర్శలకు లోకేష్ స్పందించారు ...
చంద్రబాబు పడే కష్టాన్ని విమర్శిస్తుంటే ఎంతో బాధపడ్డా అని, ఏపీ ప్రజలు తెలివైన వారని, ఎవరేంటో వాళ్లకు తెలుసుని, చంద్రబాబు పరిపాలన పై, పవన్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదని ఆయన అన్నారు... జగన్ పార్టీ చేసినట్టు, దిగజారుడు రాజకీయాలు విచారకరమని, నాతో ఫొటోలో ఉంది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని లోకేష్ అన్నారు. పెద్ది రామారావును శేఖర్‌రెడ్డి అని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు... అలాగే పోలవరం అవినీతి పై పవన్ మాటలకు స్పందిస్తూ "పోలవరంలో ఒక్క టెండరైనా తెదేపా ప్రభుత్వం ఇచ్చిందా.. ఒక్క టెండరు కూడా తెదేపా ప్రభుత్వం ఇచ్చింది కాదు... పోలవరం భూనిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు వెళ్లాయి... నా ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? పోలవరంలో పెట్టే ప్రతి ఖర్చు, పోలవరం అథారటీ పెడుతుంది... అది కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది... ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది ? " అంటూ లోకేష్ స్పందించారు...
తను అవినీతి చేశానంటూ పవన్ చేసిన ఆరోపణల పై కూడా లోకేష్ స్పందించారు " ఎవరో దుమ్మేస్తే నేను దులుపుకోవాలా? జగన్‌పై మేము చేసే ఆరోపణలపై రుజువులతో సహా చూపాం.. నిరాధారమైన ఆరోపణలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు... పవన్ వద్ద నిజంగా ఆధారాలుంటే ఒక్కరోజులోనే మాట ఎలా మారుస్తారు... ఆధారాలు ఉంటే కేసు వేసుకోండి... సీబీఐ విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారు... సీబీఐ విచారణ దేనిపై వేస్తారు.. వేసుకుంటే వేసుకోనివ్వండి... తప్పు చేయనప్పుడు మాకు భయమెందుకు... మా తాతకు చెడ్డపేరు తెస్తున్నానని ఆరోపించడం బాధ కలిగించింది... నా ఫోన్ నంబరు పవన్‌కల్యాణ్ వద్ద ఉంది... నా గురించి ఎవరో.. ఏదో.. అనుకుంటున్నారంటే అది నాకే చెప్పవచ్చు కదా... బహిరంగ సభలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటికి విలువేం ఉంటుంది" అంటూ లోకేష్, పవన్ చేసిన అవినీతి ఆరోపణల పై స్పందించారు...