మొన్నా మధ్య ఎవడో ఎదో అనుకుంటున్నాడు అని, లోకేష్ పై విరుచుకుపడ్డాడు, పవన్ కళ్యాణ్... ఆధారాలు ఉంటే చెప్పండి అంటే, ఎవరో అనుకుంటున్నారు, నా దగ్గర ఆధారాలు లేవు అన్నాడు పవన్... మరి, నీ గురించి చాలా మంది, చాలా అనుకుంటున్నారు పవన్, అవన్నీ, ఒక పెద్ద మీటింగ్ పెట్టి చెప్తే, నీ మొఖం ఎక్కడ పెట్టుకుంటావ్, అని అడుగుతున్నారు ? సంస్కారవంతులు అలా చెయ్యరు... ఒక హద్దు అనేది ఉంటుంది, అక్కడ ఆగిపోతారు... నీకు ఆ హద్దూ తెలీదు, నువ్వేమి చేస్తున్నవో తెలీదు... ఈ రోజు చేస్తున్న మ్యూజిక్ అయితే సరే సరి... అసలు నీకు బుర్ర అనేది ఉందో లేదో కూడా తెలీదు... జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు జపం చేస్తున్నట్టు, నువ్వు లోకేష్ జపం చేస్తున్నట్టు ఉంది...

lokesh 20042018 1

ఎవరో నీ మీద ఆరోపణలు చేస్తే, అది లోకేష్ చేపించాడు అన్నావ్.. 10 కోట్లకి కుట్ర అన్నావ్... చానల్స్ కుట్ర అన్నావ్... పోనీ ఒక్క ప్రూఫ్ అన్నా చూపించావా ? ఒక్కటంటే ఒక్కటి ? సోషల్ మీడియాలో గాలి గళ్ళు, చేసే కామెంట్స్ లాగా, నువ్వు కూడా అలాగే పెట్టావ్... నీ గాలి మాటలకు లోకేష్ ఇచ్చిన రిప్లై చూసావా ? నీలాగా రెచ్చిపోయి ట్వీట్ పెడితే, నువ్వు ఎక్కడ ఉంటావ్ ? అది తనకు ఉన్న సంస్కారం.. ఇదిగో చూడు ఏమి చెప్పాడో, ఇది లోకేష్ ట్వీట్ "పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ." అంటూ ట్వీట్ చేసారు.

lokesh 20042018 1

ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు లోకేష్ , పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టించినట్లు ఉంటే అది ఖచ్చితంగా తప్పే , కాదనను. కానీ,, ఒకవైపు రాంగోపాల్ వర్మ నేనే చేయించా అని చెప్తూ, శ్రీరెడ్డి వైకాపా నా వెనుక ఉంది అని చెప్తుంటే మీరు ఏ ఆధారంతో లోకేష్ మీద ఆరోపణలు చేస్తున్నారు ?? ఒకవేళ ఆధారాలుంటే బయట పెట్టండి. ఈ గాలి మాటలు, గాలి ట్వీట్ లి వేసి, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు కలిగించాలని ? ఇప్పటికి నా మీద చేసిన ఆరోపణలు నిరుపించండి అని, లోకేష్ 10 సార్లు అడిగాడు, మీరు ఒక్క ఆధారం చూపించకుండా, రసీదు ఇస్తారా అని అంటున్నారు... మీ మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తే, ఫార్మ్ హౌస్ దాటి బయటకు రాలేరు.. కొంచెం హుందా రాజకీయం నేర్చుకోండి మాష్టారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read