నిన్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు పై ఒక కామెడీ పుస్తకం రిలీజ్ చేసారు. ఆ పుస్తకం చూసి, సొంత పార్టీ నేతలే నమ్మని పరిస్థితి. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అవి ఈ వివరాలు అంటూ పుస్తకం రిలీజ్ చేసాడు జగన్. అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, 6 లక్షల కోట్లు అవినీతి చెయ్యటం ఏంటి, ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇన్ని లక్షల కోట్లు అవినీతి చేస్తే, ఒక్క చిన్న సాక్ష్యం చూపించి, కోర్ట్ కి వెళ్ళవచ్చు కదా ? లేకపోతే ఢిల్లీ లో ఉన్న, మన దోస్త్ మోడీకి చెప్తే, ఆయన చూస్తూ ఊరుకోడు కదా.. చంద్రబాబు తప్పు చేస్తే, ఇది తప్పు అని సాక్ష్యాలతో ప్రజల ముందు నిలబెట్టాలి. అప్పట్లో చంద్రబాబు అలాగే చేసారు, జగన్ ని చిప్ప కూడు తినిపించారు. మరి, ఇప్పుడు జగన్, ఇలా చెయ్యటం ఎందుకు.
అయితే, ఈ విషయం పై లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. 420-840 కలిసి జగన్-కసాయి దొంగలు అనే పుస్తకాన్ని తెచ్చారని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తమ అవినీతి పుత్రిక దర్శకత్వంలో ఈ పుస్తకం తెచ్చారన్న లోకేష్ మహామేత హయంలో జలగన్న లక్షకోట్లు దోచుకున్నారని.. దోచుకున్న సొమ్ముతో అవినీతి అనే సామ్రాజ్యాన్ని నిర్మించారని.. అవినీతి వ్యాపారంలో లాభం, వడ్డీ లెక్కేసుకోని పుస్తకం వేశారని ఆరోపించారు. ఐదేళ్ల రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగిందని అంటున్నారని.. జలగన్న కేరాఫ్ త్వరలో పిచ్చాసుపత్రి కాబోతుందంటూ ఘాటుగా పోస్ట్ చేశారు.
ఇది లోకేష్ ట్వీట్ "420, 840 కలిసి తమ అవినీతి పుత్రిక డైరక్షన్ లో ‘జగన్ - కసాయిదొంగలు’ అనే పుస్తకం వేసారు. మహామేత హయాంలో జలగన్న దోచుకున్న లక్ష కోట్లతో నిర్మించిన అవినీతి సామ్రాజ్య వ్యాపారాల్లో వచ్చిన లాభం, వడ్డీలు లెక్కేసుకొని పుస్తకం వేసారు. రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి జరిగింది అంటున్న జలగన్న కేర్ ఆఫ్ అడ్రెస్ త్వరలో పిచ్చాసుపత్రి కాబోతోంది." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. మరో పక్క మోడీ పై కూడా లోకేష్ ట్వీట్ చేసారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగారి పేరు వింటేనే ప్రధాని మోడీగారు భయంతో వణుకుతున్నారు అని ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది. ప్రధాని మోడీగారు ఆకాశంలో విహరించడంమాని భూమి మీదకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి కనిపిస్తుంది."