నారా లోకేష్ క్లాస్ లుక్‌తో అలరిస్తున్నారు. మాస్ అప్పీల్ తో అదరగొడుతున్నారు. నడకలో వేగం, స్పందించే తీరు కూడా ఆకట్టుకుంటోంది. నెల దాటినా విసుగు అన్నదే లేకుండా ప్రతీ రోజూ ఫ్రెష్‌గా పాదయాత్ర ఆరంభిస్తున్నట్టు ఉన్న లోకేష్ ఎనర్జీ లెవల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పాదయాత్రలో లోకేష్‌తో నడవాలంటే పరుగులు పెట్టాల్సి వస్తోందని యువనేతలు అంటున్నారు. ఇటీవల యువగళం యూత్ ఇంటరాక్షన్‌లో తన లుక్, స్టైల్ అన్నీ మారడానికి భార్య బ్రాహ్మణి కారణం అని లోకేష్ చెప్పుకొచ్చారు. డైట్ ప్లాన్, ఫిట్నెస్ వ్యవహారాలన్నీ భార్యే చూస్తోందని చెప్పారు. తాను ఎక్కడ ఏం తిన్నా తెలిసిపోతుందని నవ్వుతూ వివరించారు. లోకేష్ చెప్పినా, ఆ ఎనర్జీ లెవల్స్ చూసి ఆయన ఏం తింటారు అనే ఆసక్తి చాలా మందిలో మొదలైంది. దీనిపై ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేవరకూ యువగళం పాదయాత్రలో తన దినచర్యని తెలియజేశారు.
ఉదయం
క్యాంప్ సైటులో ఉదయం 6 గంటలకల్లా నిద్రలేస్తారు.
6.30కి ఫ్రెష్ అయి బ్లాక్ కాఫీ తాగుతారు
7:00 గంటల వరకూ పేపర్లు, పీఆర్ టీమ్ బ్రీఫింగ్ తీసుకుంటారు.
అరగంట పాటు అంటే 7.30 వరకూ వ్యాయామం చేస్తారు
7:50కి స్నానం చేసి రెడీ అవుతారు.
7:50 నుంచి 8:00 వరకూ అల్పాహారం
8:30 వరకూ నాయకులతో సమీక్ష సమావేశం
9:30 సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం
పాదయాత్ర ప్రారంభం
ఈ టైము వరకూ లీటర్ వాటర్ తీసుకుంటారు
మధ్యాహ్నం
12.00 గంటలకు కోకోనట్ వాటర్
1:00- 1:30 మధ్యాహ్న భోజనం (క్వినోవా విత్ వెజిటబుల్స్)
అల్లం టీ
1:30-2:00 నాయకులతో భేటీ
పాదయాత్ర ప్రారంభం
సాయంత్రంలోగా మరో లీటర్ వరకూ నీరు
5.00 గంటల కోకోనట్ వాటర్
7:00 విడిది కేంద్రం చేరిక
7:30 నాయకులతో సమీక్ష
8PM to 8:30PM - చాలా లైట్‌గా ఒక చిన్న కప్పుతో తీసుకుంటారు( ఒక రోజు ఉడకబెట్టిన వెజిటబుల్స్ మరో రోజు ఉడకబెట్టిన గుడ్డు , ఇంకో రోజు ఉడకబెట్టిన చికెన్ .
ఇదండీ నారా లోకేష్ యువగళంలో తాను పరుగులు పెడుతూ, నేతల్ని పరుగులు పెట్టిస్తోన్న డైట్, వ్యాయామం, నిద్ర ప్లాన్.