గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేశ్ శుక్రవారం నాడు మంగళగిరి మండలం చినకాకినిలో ప్రచారం చేశారు. అయితే ప్రచారానికి వెళ్తున్న ఓ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు వెనుక భాగంలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. కాగా.. ఈ వాహనం టీడీపీ నేతల పోలవరపు హరిబాబుది అని గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఈ దాడిపై హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల రెండు రోజుల ముందు రాష్ట్రంలో విధ్వంసం చేస్తారు అంటూ మాకు సమాచారం ఉందని, ఇప్పటికే తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టే వైసీపీ చర్యలు ఉంటున్నాయి. ఒకపక్క మోడీ సహకారంతో, ఐటి దాడులతో తెలుగుదేశం నేతల పై విరుచుకు పడుతున్నారు. మరో పక్క, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు కూడా అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీ చేష్టల పై అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికలు అయ్యే లోపు ఎంత గోల చేస్తారో, ఏ కుట్ర చేస్తారో, ఎంత విధ్వంసం చేస్తారో అని ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది.