మన రాష్ట్రంలో అన్నీ రివర్స్ గానే జరుగుతాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే మరీ గుడ్డిగా రివర్స్ లో వెళ్ళిపోతున్నారు. ఏమాత్రం సిగ్గు కూడా పడటం లేదు. ఏమి అయితే అది అవుతుంది అంటూ రెచ్చిపోతున్నారు. నిన్న టిడిపి కార్యాలయం పై జరిగిన విధ్వంసం అందరూ చూసారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తమ మీద ప్రేమ ఉన్న వారు బీపీ పెరిగి వెళ్లి కొట్టారని గర్వంగా నవ్వుతూ చెప్పారు కూడా. అయితే ఈ రోజు సాయంత్రం లోకేష్ మీద కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దా-డి చేశారంటూ లోకేష్ ని ఏ1 గా పెట్టి కేసు నమోదు చేసారు. ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్ సహా ఇతరులను పెట్టారు. మరి లోకేష్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. పొలేసులు ఎంత తొందర పాటు చర్యగా కేసు పెట్టారు అనేది ఈ చర్యతో అర్ధం అవుతుంది. ఎఫ్ఐఆర్ లో లోకేష్ 6.30 గంటలకు వచ్చినట్టు రాసారు. అయితే లోకేష్ ఆ సమయానికి లోకేష్ హైదరాబాద్ లో ఉన్నారు. లోకేష్ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పార్టీ ఆఫీస్ కు వచ్చారు. మరి ఇంత గుడ్డిగా ఎలా కేసు పెట్టారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా, లోకేష్ ఇదే విషయం లేవనెత్తారు.

ln 20102021 2

లోకేష్ మాట్లాడుతూ. "నేను మా నాన్నలా సాఫ్ట్ కాదు. మా నాన్న గారు ఒక చెంప పై కొడితే ఇంకో చెంప చూపిస్తారు. నన్ను కొట్టిన వాడి రెండు చెంపలు వాచిపోయేలా కొట్టే రకం నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. కొట్టిన ప్రతి దెబ్బకి బదులు ఇస్తాం. ఒకటికి పది. దా-డి చేసున్న వాళ్ళు ఎవరో తెలుసు. దా-డి వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో తెలుసు. బీ కేర్ ఫుల్. అధికారం మారితే సరెండర్ అవుతాం అనుకుంటున్నారో ఏమో. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవిస్తారు. శిక్ష కూడా మీరు ఊహించని రేంజ్ లో ఉంటుంది. దా-డి జరిగే ముందు మా నాయకులు పోలీసులకు ఫోన్ చేసినా సరిగా స్పందించలేదు. డీజీపీ ఆఫీసు ముందు నుంచే వైకాపా మూక వచ్చింది. దా-డి తర్వాత కూడా డీజీ ఆఫీసు ముందు నుంచే వెళ్లారు. తర్వాత వైకాపా కార్యాలయానికి వెళ్లారు. ఇవన్నీ డీజీపీకి కనిపించలేదా? వైకాపాకు పోరాడాలని ఉంటే టైం, ప్లేస్ చెబితే మేమే వస్తాం. చంద్రబాబు గారికి చాలా సహనం. ఏనాడూ మేం పరుషంగా మాట్లాడలేదు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. రాత్రి 8.30 గంటలకు నేను మా పార్టీ కార్యాలయానికి వచ్చాను. ఇక్కడ డీజీపీ పీఆర్వో వైకాపా మూకతో కలిసి దా-డికి పాల్పడ్డాడని చెప్పారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? అని లోకేష్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read