సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన పై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రతి ఏడాది 14-15మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక చంద్రబాబు సదస్సుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఏడు రోజుల పర్యటనను 4రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది. 15మందికి బదులు ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు విధించింది. దీంతో ఈనెల 20 నుంచి 26వ తేదీవరకు దావోస్‌ వెళ్లేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆంక్షలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష్యం పై ఐటీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు వేధిస్తోందని లోకేశ్ ప్రశ్నించారు. ఏపీకి పరిశ్రమలు వస్తే భారత్ కు పరిశ్రమలు వచ్చినట్లు కాదా? అని నిలదీశారు.

lokesh 04012019

స్విట్జర్లాండ్ లో దావోస్ లో ప్రతీ ఏటా జరిగే ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో చంద్రబాబు పాల్గొనడం వల్ల ఏపీకి చాలా లాభం చేకూరిందని మంత్రి తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు దావోస్ పర్యటనపై అర్థంలేని ఆంక్షలు విధిస్తూ మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ వేధింపులకు గురికావడానికి తెలుగువారు చేసిన తప్పేమిటి? అని లోకేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ మంత్రి ట్విట్టర్ లో స్పందించారు. మరో పక్క, ఆంధ్రా మోదీని కాపాడేందుకు దిల్లీ మోదీ సీబీఐని భాజపా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌గా మార్చేశారని లోకేశ్‌ విమర్శించారు. ప్రజాధనాన్ని నిలువునా దోచుకున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌కు కేసుల నుంచి విముక్తి కల్పించి ఏపీని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు.

lokesh 04012019

భాజపా భారతీయ జోకర్స్‌ పార్టీగా మారిందని, ఆంధ్రప్రదేశ్‌కు నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని ఏపీ భాజపా నేతలు ఈ రోజు సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాను ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయని లోకేశ్‌ ఈ సందర్భంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కు అని, ఇందులో భాజపా భిక్ష ఏమీ లేదని, చంద్రబాబు కష్టమే ఉందన్నారు. ఉపాధి హామీలో ఎక్కువ నిధులు కేటాయించామని అర్థంలేని చర్చలు చేస్తున్న ఏపీ భాజపా నేతలు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉపాధి హామీ పథకంలో ఎందుకు వెనుకబడి ఉన్నాయో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read