ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా, సోషల్ మీడియా అరెస్ట్ లు తగ్గాయి అనుకుంటే, మళ్ళీ మొదలయ్యాయి. నిన్న గుంటూరులో పోలీసులు సిబిఎన్ ఆర్మీకి చెందిన ఇద్దరిన అరెస్ట్ చేసారు. యుట్యూబ్ లో, విజయసాయి రెడ్డిని కించపరుస్తూ వీడియో పెట్టారని వారిని అరెస్ట్ చేసారు. అయితే చంద్రబాబు పుట్టిన రోజున నాడు, చంద్రబాబుని 420 అంటూ విజయసాయి రెడ్డి సంబోధిస్తే, దానికి ఆగ్రహించిన ఒక వ్యక్తి విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తూ, ఒక వీడియో పెడితే, వీళ్ళు ఆ వీడియోని యుట్యూబ్ లో పెట్టటంతో, ఇద్దరినీ అరెస్ట్ చేసారు. మరి చంద్రబాబుని 420 అని చెప్పిన విజయసాయి రెడ్డి పైన మాత్రం, ఎలాంటి చర్యలు లేవు. ఇది ఇలా ఉంటే, ఈ అరెస్ట్ విషయం చెప్పటానికి, గుంటూరు ఎప్సీ అమ్మిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో అరెస్ట్ కు గల కారణాలు వివరించారు. అయితే చివరలో, ఒక విలేఖరి, ఇదే పోలీస్ స్టేషన్ లో, తెలుగుదేశం నాయకులు, మంత్రి అప్పల రాజు పై, కేసు పెట్టారని, ఆ కేసు అసలు ఫైల్ చేసారా, ఎంత వరకు ఆ కేసు వచ్చింది అని ఎప్సీని ప్రశ్నించారు. అయితే ఎస్పీ సమాధానం ఇస్తూ, లైట్ ఫెయిల్, ఆడియో ఫెయిల్, ఏమి కనిపించటం లేదు అంటూ, మీడియా సమావేశం నుంచి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు.

lokesh 19052021 2

దీంతో అందరూ షాక్ అయ్యారు. ఎదో ఎస్సై, సిఐ లు అంటే అనుకోవచ్చు కానీ, ఏకంగా ఎస్పీ కూడా ఇలా ఏకపక్షంగా వ్యవహరించటం పై, తెలుగుదేశం నేతలు ఫైర్ అయ్యారు. అయితే ఇదే విషయం పై స్పందించిన టిడిపి నేత నారా లోకేష్, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి పై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ లో స్పందిస్తూ, అమ్మిరెడ్డి గారు, మీరు ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్న విషయం గుర్తుంచుకోవాలని, తాడేపల్లి ప్యాలస్ కి చాకిరీ చేయటం సిగ్గు చేటు అని స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, వాళ్ళు ఏదో ఉ-గ్ర-వా-దు-లు అయినట్టు, ముసుగులు వేసి ఎందుకు అంత ఓవర్ ఆక్షన్ అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాల పై మేము అనేక కేసులు పెట్టాం, వాటి సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. అప్పలరాజు కేసు గురించి చెప్పమంటే, రివర్స్ లో కేసు పెట్టటానికి వచ్చిన వారి పై కేసు పెట్టారని, మీకు అంత ఉత్సాహంగా ఉంటే, కుల పిచ్చి ఉంటే, పవిత్రమైన ఖాకీ చొక్కా తీసి, బుగులు కండువా కప్పుకోండి అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read