వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారో ఏమో కాని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, మార్ఫింగ్లు, అసభ్యకర పోస్టింగ్ లు మాత్రం ఆపటం లేదు. అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉండగా, సాక్షి ఆఫీస్ లో పని చేసే, ఇంటూరు రవి కిరణ్ అనే వ్యక్తి, శాసనమండలి పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు తయారు చెయ్యటంతో, శాసనమండలి సభ్యులు కేసు పెట్టటంతో, పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే, అప్పట్లో ఆ వ్యక్తి కోసం, విజయసాయి రెడ్డి రోడ్డు ఎక్కారు. నేను కూడా సోషల్ మీడియాలో, ఇష్టం వచ్చినట్టు రాస్తాను ఏమి చేస్తారో చేసుకోండి అంటూ, అసభ్యకర రాతలు రాసే ఇంటూరి రవి కిరణ్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో ప్రతిపక్షం కాబట్టి, వీళ్ళు ఏమి చేసినా చెల్లింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏమి మంచి చేస్తున్నామో చెప్పాలి కానీ, అది చెయ్యకుండా, అసభ్యకర రాతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

lokesh 28082019 2

వరదల్లో పంట నష్టపోయి, మంత్రి పై నోరు జారాడని, అతను టిడిపి పైడ్ ఆర్టిస్ట్ అంటూ, జైల్లో పెడితే, ఇలాంటి అసభ్యకర రాతలు, విజయసాయి రెడ్డి అండగా ఉంటూ రాస్తున్న, ఈ రవి కిరణ్ లాంటి వాళ్ళు, పైడ్ ఆర్టిస్ట్ లు కారా ? చట్టాలు వీరికి పని చెయ్యవా ? వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు సియంగా ఉండగా, అనూ రాజేశ్వరి అనే మహిళ, కొడుక్కుని లుకేమియా వ్యాధి వస్తే, సియం రిలీఫ్ ఫండ్ కింద, డబ్బులు ఇచ్చి, ఆమె కొడుకుని బ్రతికించారు. వారం రోజుల క్రితం, బిడ్డకు పూర్తిగా నయం అవటంతో, ఆమె కృతజ్ఞతగా, చంద్రబాబు వద్దకు వచ్చి, ఆమె కొడుకుకి నయం అయ్యిందని, చంద్రబాబుకి కృతజ్ఞత చెప్పి, సంతోషాన్ని పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోలు చూపిస్తూ, సాక్షిలో/వైసీపీలో పని చేసే ఇంటూరు రవి కిరణ్ అనే వ్యక్తి, చంద్రబాబు, ఆ మహిళ పై, అసభ్యకరంగా పోస్టర్ వేసి, పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ, ఆవేదనతో ఫేస్బుక్ లైవ్ పెట్టి, కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయం పై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.

lokesh 28082019 3

ఇది నారా లోకేష్ ట్వీట్... "దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులూ అధికారంలోకి వస్తే సంస్కారహీనులు ఇలాగే రెచ్చిపోతారు. అనూ రాజేశ్వరి అనే తెదేపా కార్యకర్త, ఒక బీసీ మహిళ. ఆమె కొడుక్కి లుకేమియా వ్యాధి వస్తే మానవత్వంతో ఆదుకున్న చంద్రబాబుగారు ఆమె దృష్టిలో దైవంతో సమానం. రాజేశ్వరిగారు చంద్రబాబుగారిని కలవడానికి వచ్చినప్పటి ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసారు వైసీపీ వాళ్ళు. ఇక కామెంట్లు అయితే సభ్యసమాజం తలదించుకునేలా, అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. జగన్ గారూ! ఒక బీసీ మహిళను నీచంగా అవమానించిన వారి అహంకారానికి పార్టీపెద్దగా మీరు సమాధానం చెప్పాలి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెదేపా కార్యకర్తలపై దాడులు చేసారు. ఆస్తులు కూల్చారు. ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఇలాంటి నీచమైన చర్యలకు దిగారు. ఇక మీ ఆగడాలు సహించేది లేదు. ఏ రకంగా మిమ్మల్ని కట్టడి చేయాలో మాకూ తెలుసు. న్యాయపరంగా, హక్కులపరంగా మీకు బుద్ధి చెప్పేవరకు పోరాడుతాం. ఖబడ్ధార్!" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read