జిఈఎస్ సదస్సులో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఐటి అంటే ఇవాంక ట్రంప్ అని అద్భుతంగా మాట్లాడారు... ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు మాట్లాడటం రాదు అంటూ, సోషల్ మీడియాలో సైకో సోషల్ మీడియా ఫాన్స్ మళ్లీ వీడియోలు పోస్ట్ చేసి శునకానందం పొందుతున్నారు. ఇవాంకా వచ్చిన దగ్గర నుండి జిఈఎస్ సభ వరకూ అన్ని వేదికల్లో చంద్రబాబే కనిపించినా, ఆయన్ని కనీసం ఈ సభకి ఆహ్వానించక పోయినా ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి తన పని సైలెంట్ గా చక్కబెట్టుకొని వెళ్లాడు... ఐటి అంటే ఇవాంకా ట్రంప్ అనే అంత తెలివి తేటలు ఆంధ్రా ఐటి మంత్రికి లేక ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏమి లేని రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావాలి, పెట్టుబడులు ఆహ్వానించాలి అని తన తండ్రి నిర్మించిన సిటీ లో ఏం చేసాడు చూడండి....
జిఈఎస్ సదస్సుకు ఆహ్వానం లేదు, కానీ మంచి కంపెనీలు అక్కడికి వస్తాయి. వారిని ఎలా అయినా కలవాలి అనే సంకల్పంతో యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం ఛైర్మన్ జాన్ టి చాంబర్స్ అపోయింట్మెంట్ సంపాదించి అతనికి మన రాష్ట్ర పరిస్థితిలు,రాష్ట్రంలో ఉన్న వనరులు ,ఇబ్బందులు గురించి వివరించి రాష్ట్రానికి సహకరించాలి అని కోరాడు. అక్కడితో ఆగిపోలేదు సదస్సు జరిగే ఒక్క రోజు ముందే సభకు వచ్చే పారిశ్రామికవేత్తలు అందరిని కలిసాడు లోకేష్. అజుర్ పవర్ కంపెనీ డైరెక్టర్ వాధ్వ,ఉబర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా హెడ్ అమిత్ జైన్,వెంకలాసెన్ అసోసియేట్స్ డైరెక్టర్ హేమంత్ సందు, ఫస్ట్ సోలార్ కంపెనీ సుజయ్ గోష్ , జిఈ కంపెనీ సీఈఓ విశాల్ వాన్ చౌ,ఎమ్ఎస్డి ఫార్మా డైరెక్టర్ వాసుదేవ్ ఇలా సదస్సు కు వచ్చిన వారి అందరిని వారు ఉంటున్న హోటల్ కి వెళ్లి మరీ రాష్ట్రం గురించి జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించి సైలెంట్ గా అమరావతి కి వెళ్లి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యాడు...
అయితే లోకేష్ అసెంబ్లీ ఒక రోజు ఎగ్గొట్టి హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అని కొన్ని పత్రికల్లో సర్వ సాధారణంగా రసాయి... నిధులు లేవు,లోటు బడ్జెట్,హైదరాబాద్లో లా తినడానికి వండి వడ్డించిన బిర్యానీ లేదు అయినా తండ్రి చూపించిన మార్గం ఉంది. ఫైల్ పట్టుకొని ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాష్ట్రం అభివృద్ధి చెయ్యాలనే సంకల్పం ఉంది అంటూ లోకేష్ రోజుకి 14 గంటలు తిరుగుతుంటే, ఇంకా జగన్ సోషల్ మీడియా మాఫియా లోకేష్ నే టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ వీడియోలు పెట్టడాన్ని చూస్తే లోకేష్ గురించి జగన్ ఎంత భయపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.... ప్రజా సమస్యలు మీద స్పందిస్తే, ప్రజల కోసం పని చేస్తే, మీరు ఎంత గేలి చేసినా, ప్రజలు ఆదరిస్తారు... ప్రజలకి ఎవరేంటో తెలీదు అనుకుంటే, అది మీ భ్రమ... మీరు పొందే తాత్కాలిక ఆనందం, మీరు చేసే పిచ్చి వీడియోలోతో, రాష్ట్రంలో ఉన్న ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు... దానికంటే ప్రజా సమస్యలు మీద వీడియోలు చేసుకుంటో, ఎవరో ఒక్కరన్నా మిమ్మల్ని నమ్ముతారు...