ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గత వారం రోజులుగా మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఫోకస్ లభించింది. దీనికి ప్రధాన కారణం పరీక్షలు. దేశంలో అన్ని రాష్ట్రాలు పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, మేము పరీక్షలు జరిపి తీరుతాం అని, ఏది ఏమైనా, ఎవరు ఏమి అనుకున్నా, మిగతా రాష్ట్రాలు రద్దు చేసినా, మాకు అనవసరం అనే విధంగా, పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యార్ధులు, ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు ఎంత గొడవ చేసినా, వారి అభిప్రాయలు కనీసం పట్టించుకోలేదు. అయితే ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము పరీక్షలు జరిపి తీరుతాం అని చెప్పింది. దీంతో సుప్రీం కోర్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏపి ప్రభుత్వం వేసిన అఫిడవిట్ చూసి, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ప్రణాళిక సరిగ్గా లేదని, మీరు ఈ ప్రణాళికతో పరీక్షలకు వెళ్తే, ఒక్క విద్యార్ధి క-రో-నా బారిన పడినా మీరే బాధ్యత వహించాలి అంటూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆగ్రహం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, దిద్దిబాటు చర్యలకు ఉపక్రమించింది. వెంటనే ప్రకాశం జిల్లా నుంచి మంత్రిని పిలిపించి, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టించి, పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

lokesh 26062021 1

అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. గత రెండు నెలలుగా , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, నారా లోకేష్ ఈ పరీక్షలు రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు. విద్యార్దులు, తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసారు. ప్రతి క్షణం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. న్యాయ పోరాటం కూడా చేసారు. దీంతో పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే, విద్యార్ధులు, తల్లిదండ్రులు లోకేష్ కి ధన్యవాదాలు చెప్పారు. సోషల్ మీడియాలో లోకేష్ కి ధన్యవాదాలు చెప్తూ, పోస్ట్ లు హోరెత్తాయి. దీంతో ప్రభుత్వ పెద్దలకు ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. పరీక్షలు రద్దు చేస్తే, జగన్ మోహన్ రెడ్డికి విద్యార్ధులు థాంక్స్ చెప్పాలి కానీ, లోకేష్ కు సోషల్ మీడియాలో ధన్యవాదాలు రావటం పై, షాక్ అయ్యారు. అసలు ఎక్కడ తేడా వచ్చింది, సలహాదారులు ఏమి చేస్తున్నారు ? అంటూ వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్ధి వర్గం దూరం అయ్యే చర్యలు జరుగుతుంటే, ఏమి చేస్తున్నారు అంటూ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు. దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read