ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, విశాఖలో పర్యటించారు. డాక్టర్ సు-ధా-క-ర్ ఇంటికి వెళ్లి, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించిన తరువాత, మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి విలేఖరి మాట్లాడుతూ, డాక్టర్ సు-ధా-క-ర్ గతంలో, జగన్ గారిని దేవుడు అంటూ పోల్చారు కదా, మీరు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని లోకేష్ ని ప్రశ్నించారు. దానికి లోకేష్ సమాధానం ఇస్తూ ఉండగా, డాక్టర్ సుధాకర్ తల్లి కలుగు చేసుకుని, సాక్షి విలేఖరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆమె మాటల్లోనే, "నా బిడ్డ, జగన్ గారిని దేవుడు అన్నారని అంటున్నారు, కానీ నా బిడ్డను రోడ్డున పడేసి కొ-ట్టి-న రోజు ఒక తల్లిగా నా ఆవేదన మీ అందరూ చూసారు. మరి ఆ రోజు ఒక్కరైనా వచ్చారా ? ఒక్కరైనా నా బిడ్డకు జరిగిన అన్యాయం ఏమిటి అని అడిగారా ? ఈ రోజు లోకేష్ బాబు వచ్చారు అంటే, మరి నేను ఎవరిని మెచ్చుకోవాలి ? ఎవరిని నేను ప్రేమించాలో మీరే చెప్పాలి. ఇందుకేనా ఆ రోజు మేము ఆయన్ను గెలిపించుకున్నది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల గురించి నేను చెప్తున్నా. నర్సీపట్నం ఎమ్మెల్యే గురించి చెప్తున్నా. ఆయనకు సపోర్ట్ గా ఉన్న అదీప్ రాజ్ గురించి చెప్తున్నా. ఆయన ఒక కబ్జా కోరారు. ఆ కబ్జా కోరు, ఈ ఎమ్మెల్యే ఒకటి అయ్యి, నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. అంతకంటే ఇక నేను ఏమి చెప్పను ?"

ln 24052021 2

"నా కొడుకు ఆయన్ను దేవుడులా అనుకోవచ్చు, వాడికి వచ్చిన వేధింపులు అవన్నీ కూడా, ఆ సమయంలో అలా చెప్పకపోతే ఇంకా బయలుదేరతారు వాడిని వేదించటానికి, ఆ ఉద్దేశంలో వాడు అని ఉండొచ్చు, లేదా నిజంగా దేవుడు అనుకుని ఉండొచ్చు, నేను ఏమి చెప్పలేదు. కానీ వాళ్ళు మాత్రం నా కొడుకుని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళని మాత్రం వదలోద్దని కోరుతున్నా. ఇంత కష్టపడి, నా కోసం లోకేష్ బాబు వచ్చారు. నిజంగా చెప్పాలి అంటే, ఆయనకు ఎంత థాంక్స్ చెప్పాలో అంత చెప్పాలి. నన్ను కూడా వాళ్ళు సగం చం-పే-శా-రు. కానీ నా బిడ్డకు న్యాయం జరిగే వరకు మాత్రం నేను ఉంటాను. నా బిడ్డ పోయాడు అని చెప్పి వదిలేస్తాం అనుకుంటున్నారేమో, అటువంటిది జరగదు. వాళ్ళ అందరికీ శిక్ష పడే వారకు, ఈ ప్రాణం నిలబడే ఉంటుంది. నేను పోరాడతాను అంటూ" ఆమె ప్రసంగం ముగించారు. ఈ వయసులో కూడా, ఆమె మాట్లాడిన తీరు అందరికీ స్పూర్తి నింపింది. తమ బిడ్డ కోసం, ఆయనకు జరిగిన అన్యాయం కోసం, ఆమె పోరాడుతున్న తీరు ప్రశంసనీయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read