మాటలు చెప్పే వాడు ఒక వైపు... చేతల్లో చూపించే వాడు ఒక వైపు... సోషల్ మీడియాలో భజన చేపించుకునే వాడు ఒక వైపు.. సోషల్ మీడియాలో హేళన చేసే పైడ్ టీంకు బలయ్యే వాడు ఒక వైపు... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక వైపు... చంద్రబాబు అనే బ్రాండ్ ఇమేజ్ ఇంకో వైపు.. చివరకు సొల్లు చెప్పే వాడు కాకుండా, సమర్థుడు సాధించాడు.. ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్‌’ మన రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీని కోసం తెలంగాణా కూడా పోటీ పడింది. అక్కడ ఐటి మంత్రి కేటీఆర్ మే 25, 2017న అమెరికా వెళ్లి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని కలిసి, వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడిగారు. ఇది తప్పు కాదు కాని, అసలు విషయం ఇక్కడే ఉంది.

lokesh 03072018 2

మే 4, 2017లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన చేసారు. ఆ సందర్భంగా, వెళ్లి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని కలిసి, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడిగారు. మన ప్రభుత్వం తరుపున, ఇచ్చే రాయతీలు అన్నీ వివరించారు. అప్పటి వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/nbpBNnxWEVM . తరువాత లోకేష్ ఫాలో అప్ అవ్వటం మొదలు పెట్టారు. డిసెంబర్ లో అమెరికా వెళ్లి డీల్ క్లోజ్ చేసారు. అయితే, చంద్రబాబు మే 4, 2017లో వెళ్లి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని కలిసినట్టు తెలుసుకున్న కేటీఆర్ వెంటనే అమెరికా వెళ్లారు. మే 25, 2017న అమెరికా వెళ్లి, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని తెలంగాణాలో పెట్టమని కోరారు. ఈ సందిగ్ధంలో, లోకేష్ చూపిన చొరవ, ఆక్టివ్ ఫాలో అప్ తో, ఈ కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది.

lokesh 03072018 3

ఇది ఇలా ఉంటే, ఈ కంపెనీతో చర్చలు అన్నీ సీక్రెట్ గా సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉండడమే దీనికి కారణం. బెంగళూరు, తిరుపతిలో ఆ సంస్థ ప్రతినిధులను కలిసినప్పుడు కూడా విషయాలు ఎవరికీ వివరించలేదు. తర్వాత ఈ మూడు నెలల కాలంలో పలుమార్లు చర్చలు జరిపినా మీడియాకు చెప్పలేదు. ఒప్పందానికి ఒకరోజు ముందు మీడియాకు సమాచారం ఇచ్చినా.. ఒక పెద్ద కంపెనీ వస్తుందన్నారే తప్ప.. కంపెనీ పేరు మాత్రం వెల్లడించలేదు. పెద్ద పెద్ద నగరాలు లేని, సేవా రంగం అంతగా అభివృద్ధి చెందని మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకొచ్చేందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోందని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read