ఈ రోజు నారా లోకేష్ పర్యటన మొత్తం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల మధ్య సాగింది. చివరకు ఆయనకు నోటీస్ ఇచ్చి, ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్లారు. అయితే ఈ రోజు జరిగిన పరిణామాల పై లోకేష్ ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నారు. ఈ రోజు నాలుగు గంటలకు ప్రెస్ ని పిలిచారు. నాలుగు గంటలకు ప్రెస్ రావాలని, మీడియా సమావేశం ఉంటుందని, లోకేష్ మాట్లాడతారు అంటూ, లోకేష్ ఆఫీస్ నుంచి మీడియాకు కబురు వచ్చింది. దీంతో మీడియా మొత్తం, ఉండవల్లి బయలు దేరింది. కరకట్ట వద్దకు వచ్చిన మీడియా షాక్ కు గురయ్యింది. అక్కడ మీడియా వారికి పర్మిషన్ లేదు అంటూ, పోలీసులు బ్యారికేడ్ లు పెట్టారు. మీడియా ప్రతినిధులకు అనుమతులు లేవు అంటూ చెప్పటంతో, మీడియా కూడా షాక్ అయ్యింది. దీంతో ఏమి చేయాలో అర్ధం కాక, మీడియా ప్రతినిధులు వెనుదిరిగారు. ఈ విషయం తెలిసిన లోకేష్, మీడియా సమావేశాన్ని 5 గంటలకు వాయిదా వేసారు. మీడియా వారు అయుదు గంటలకు రావాలి అంటూ కబురు పంపించారు. ఇప్పుడే కొద్ది సేపటి క్రితమే మీడియా సమావేశం ప్రారంభం అయ్యింది. అయితే ఏకంగా మీడియాను ఆపటం పై, అందరూ షాక్ అయ్యారు. అసలు లోకేష్ ని ఎందుకు ఆపుతున్నారో తెలియదని అందరూ అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు మీడియాను కూడా అడ్డుకున్నారు.
ఏమైనా వాస్తవాలు బయట పడతాయని, ఇలా చేస్తున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావటం లేదని టిడిపి అంటుంది. లోకేష్ వెళ్తాను అంటే అతన్ని ఆపేసారని, ఇప్పుడు మీడియాను కూడా రానివ్వక పోవటం ఏమిటి అంటూ, టిడిపి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. గతంలో జగన కి కూడా ఇలాగే చేసి ఉంటే, ఆయన పాదయాత్ర చేసే వారా అని టిడిపి ప్రశ్నిస్తుంది. ఆడ పిల్లలకు అండగా ఉండటానికి వెళ్తుంటే కూడా ఇలా నిర్బంధాలు చేస్తుంటే, ఎవరికి చెప్పుకోవాలి అంటూ, టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు లోకేష్ పర్యటనతో, ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయట పడింది. లోకేష్ పర్యటనను అడ్డుకుని, చివరకు ఆయన ట్రాఫిక్ ఆపారు అంటూ, ఆయనకు నోటీస్ ఇచ్చి, పోలీస్ బందోబస్తుతో, ఆయన్ను తీసుకుని వెళ్లి, ఇంటిలో పెట్టి వచ్చారు. ఇప్పుడు మీడియాని కూడా అడ్డుకున్నారు.