ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెలంగాణ సిద్ధ‌మైన సమయంలో రాష్ట్రంలో టీడీపీ వ్యూహం ఏంట‌నేది కొంత ఆస‌క్తిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ లాబీల్లో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. గత ఎన్నికలకంటే ముందే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని, కాని కేసీఆర్‌కే కేంద్రం బాగా సహకరించిందన్నారు . ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్‌ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు అడిగినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ... కేసీఆర్ కు మాత్రం అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని విమర్శించారు.

lokesh 08092018 2

సీఎంలకే అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ.. కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌కు మాత్రం ఆ అవకాశం ఇచ్చారని చెప్పారు. కష్టాల్లో ఉన్న ఏపీని పట్టించుకోని మోదీ... కేసీఆర్ కోరికలన్నింటికీ ఆమోదముద్ర వేశారని విమర్శించారు. మాకు బీజేపీతో గోత్రాలు కలవవు అని కెసిఆర్ చెప్పిన మాటకు స్పందిస్తూ, అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని ఎద్దేవా చేశారు. మరోవైపు ఏపీలో అవినీతిపరుడు జగన్‌కు కేంద్రం సహకరిస్తోందని లోకేశ్‌ మండిపడ్డారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసే బిల్లును కేంద్రానికి పంపితే ఇంతవరకు ఆమోదించలేదని అన్నారు. జగన్ ను కాపాడేందుకే ఈ బిల్లును పక్కన పెట్టారని అన్నారు.

lokesh 08092018 3

ఈ బిల్ ఆమోదం పొందితే, రాష్ట్రంలో అందరికంటే నష్టపోయిది, నెంబర్ వన్ దొంగ అయిన జగనే కాబట్టి, కేంద్రం ఆ బిల్ ఆమోదం చెయ్యటం లేదని అన్నారు. ఒక పక్క అవినీతి పై యుద్ధం అని చెప్తున్న ప్రధాని, ఇలాంటి బిల్ ను ఎందుకు ఆమోదించటం లేదో చెప్పాలని అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అటూ ఇటూ పెట్టుకుని, ప్రధాని అవినీతి గురించి మాట్లాడుతున్నారని లోకేష్ విమర్శించారు. విజయసాయి రెడ్డి, ప్రధాని ఆఫీస్ లో అనేకసార్లు మీడియాకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read