గత ప్రభుత్వ హయంలో, ప్రభుత్వ జూనియర్ కాలీజేల్లో, డ్రాప్ అవుట్ లు తగ్గించటానికి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్రవేశ పెట్టారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది కూడా. అయితే జగన్ ప్రభుత్వం రాగానే, ఇంటర్ పిల్లలకు, మధ్యాహ్న భోజనం అవసరం లేదని, దాన్ని తీసేసారు. దీని పై విధ్యార్ధులు ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయం పై, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. జగన్‌ మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ సొమ్ము పొదుపు చెయ్యాలి అనుకుంటే, 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే లాగెయ్యలా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పేదల ముద్ద లాగేస్తూ, తాను మాత్రం, తన ఇంటి దగ్గర రోడ్డ వెయ్యటానికి, 1.3 కిమీ రోడ్డు వెయ్యటానికి 5 కోట్లు, టాయిలెట్లు కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

జగన్ మాత్రం ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు అనటం దారుణమని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పధకం మళ్ళీ ప్రవేశపెట్టాలని కోరారు. ఇక చంద్రబాబు హయంలో, హౌసింగ్ స్కీం మొత్తం అవినీతి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై కూడా లోకేష్ స్పందించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఇందిరమ్మ ఇళ్ల అవకతవకల గురించి లోకేష్ ప్రస్తావించారు. ఆ సమయంలో, జగన్ క్విడ్ ప్రో కోలో బిజీ గా ఉండి, ఈ స్కాం గురించి తెలిసి ఉండదు, బొత్స సత్యనారాయణగారిని అడిగితె ఆ భోగతం అంతా చెప్తారని లోకేష్ అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతో చంద్రబాబుగారు పేదల కోసం ధనవంతుల ఇళ్ళకు తీసిపోని అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్ళు కట్టించారని, మూడు విడతల్లో 8,00,346 ఇళ్ళు ప్రజలకు ఇచ్చామని, మేము గర్వంగా చెప్పుకుంటామని లోకేష్ అన్నారు. అవినీతి అవినీతి అంటున్నారు, అవినీతి ఎక్కడ ఉందో రుజువు చెయ్యండి అని ఛాలెంజ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read