ఎన్ని అడ్డంకులు సృష్టించినా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆరంభమైపోయింది. తారకరత్న గుండెపోటు ఘటనని విషప్రచారానికి వాడుకోవాలనుకున్నారు. అయితే లైవ్ విజువల్ ఉండడంతోపాటు తారకరత్న వైద్యం నుంచి అన్నీ తానై బాబాయ్ బాలయ్య చూసుకుంటున్నాడు. లోకేష్, చంద్రబాబు, పురందేశ్వరి మొత్తం కుటుంబం తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తోంది. బాబాయ్ ని గొడ్డలితో వేసేసిన అబ్బాయిలు మీరైతే, అబ్బాయ్ ని బతికించుకోవడం కోసం బాబాయ్ నిద్రాహారాలు మానిన చరిత్ర మాదంటూ టిడిపి గట్టిగానే వైసీపీ బ్యాచులకు కౌంటర్లు ఇస్తోంది. మరోవైపు టిడిపి యువగళం పాదయాత్రలో లోకేష్ కి దూరంగా సామాన్య జనంలో పసుపు టీ షర్ట్ వేసుకుని, టిడిపి క్యాప్ పెట్టుకుని ఒకతను ఉన్నాడని టిడిపి నేతలు ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన బాగా తెలిసిన యువనేత మీరేంటండి ఇక్కడ, ఈ డ్రెస్సులో అని ఆరా తీసారట. తన పేరు బయటకు చెప్పొద్దని ఆ నేతని వేడుకున్న ఆ పోలీసు మాకు ఓ స్పెషల్ టాస్క్ అప్పగించారని చెప్పేశాడు. ఏంటా టాస్క్ అంటే, పాదయాత్రకి-టిడిపికి వ్యతిరేకంగా కొందరు మనుషుల్ని పెట్టుకుని పాదయాత్రలోనే వీడియోలు, బైట్లు ఓ బ్యాచు షూట్ చేస్తుంది. వారికి రక్షణ కల్పించే బాధ్యత ఈ పసుపు షర్ట్ వేసుకున్న పోలీసులే చూడాలట. వారిని టిడిపి వాళ్లు అడ్డుకున్నా, దాడిచేసినా వారిని తప్పించాల్సిన బాధ్యత ఈ ఎల్లో షర్టుల్లో ఉన్న పోలీసులదేనట. ఇలా ఓ పదిమంది అమరావతి నుంచి కుప్పం చేరారట. గతంలోనూ టిడిపి కేంద్ర కార్యాలయంపై దా-డి చేసేందుకు వచ్చిన వారికి రక్షణగా పోలీసులు వచ్చి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ యువగళంలో కూడా ఇదిగో ఇలా ఖాకీ డ్రెస్సులు విప్పేసి ఎల్లో షర్టుల్లో పోలీసులు దూరుతున్నారని టిడిపి ఆరోపిస్తుంది..
లోకేష్ పాదయాత్రలో ఎల్లో డ్రెస్ పోలీసులు ? ఎందుకో మరి ?
Advertisements