పీలేరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై దాడికి యత్నించిన వైసీపీ మూకల్ని టిడిపి కేడర్ తరిమేసింది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో జనహోరుతో కదం తొక్కింది. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తన సత్తా చాటారు. పీలేరు పట్టణంలో అడుగు తీసి అడుగు వేసే ఖాళీ లేనంతగా జనంతో నిండిపోయింది. నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు పరుగులు పెట్టారు. పీలేరు పట్టణంలో లోకేష్‌పై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తిపోయింది. పెద్దెత్తున యువత పాదయాత్ర ఆరంభమైన నుంచీ రాత్రివరకూ యువనేత వెంటే ఉన్నారు. బహిరంగ సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రసంగానికి ఈలలు, చప్పట్లు మారుమోగాయి. వేదికపై నుంచి మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఎక్కడ ఎంత దోచారో లెక్కలు ప్రజల ముందుంచారు. పాపాల పెద్దిరెడ్డి, ఆయన పార్టీని ఓడించకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. యువగళం పాదయాత్ర పీలేరులో అంచనాలకు మించి దిగ్విజయం కావడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గిరిధర్ నాథ్ రెడ్డి తన అనుచరులతో కలిపి దాడి చేసేందుకు ప్రయత్నించారు. వేలాదిగా టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడటంతో పారిపోయి మార్కెట్ యార్డులో దాక్కున్నారు. పాదయాత్ర సాగే ప్రాంతాలలో కరెంటు తీసేశారు. పోలీసులు ఎక్కడికక్కడే అడ్డంకులు కల్పించారు. అయినా యువగళం పీలేరులో గర్జించింది. సవాల్ విసిరింది. వైసీపీ మూకలే తోకముడిచాయి.
లోకేష్ పాదయత్రలో వైసిపీ మూకలు... పరిగెత్తించి కొట్టిన టిడిపి శ్రేణులు...
Advertisements