వైసీపీ టార్గెట్‌గా మరోసారి ట్వీట్ బాంబ్ పేల్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. వైసీపీ-బీజేపీపై మధ్య రహస్య బంధం ఉందని.. సాక్ష్యం కూడా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. లోకేష్ తన ట్వీట్‌లో ‘నిజమే.. రహస్య మిత్రుల బంధం బయటపడింది.. ప్రజలకు కూడా తెలిసిపోయింది. #BharatiyaJaganSamithiParty (భారతీయజగన్‌సమితిపార్టీ) అభివృద్ధికి ఎలా అడ్డుపడుతుందో’అంటూ సెటైర్ పేల్చారు. "Yeah, right! The ‘secret allies’ are spilling the beans over the ‘secret alliance’ which is ‘not a secret’ anymore! Good that people now know how #BharatiyaJaganSamithiParty are major obstacles for development."
తెలుగురాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభ జన బిల్లు జగన్ వల్లే నిలిచిపోయిందని, జగన్ కోరిక మీదటే మోదీ ఈ బిల్లు రాకుండా చూశారని, దానికి ప్రత్యక్షసాక్షిని తానేనని వైసీపీకి మిత్రపక్షమైన టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో విభేదాల కారణంగానే జగన్ అభిప్రాయానికి మోదీ పెద్దపీట వేశారని ఎంపీ వినోద్ చెప్పారు. కాపు, బోయల రిజర్వే షన్ల అంశం కేంద్రం పరిధిలో ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశాలు పూర్తి రిజర్వేషన్లు అమలైతే వైసీపీ కనుమరుగవుతుందన్న కార ణంతో అమలుకాకుండా చేయాలని మోదీ, జగన్ కు సహకరించారనేది అక్కడ చెప్పిన విషయం.
మరో పక్క దుబాయ్ లో ఎన్నారై టీడీపీ సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. తెలంగాణ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. విభజన సమయంలో తెలంగాణకు కూడా అనేక హామీలు ఇచ్చారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, అయినా కేంద్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. తెలుగువారంతా కలసికట్టుగా అభివృద్ధి చెందాలనేదే టీడీపీ ఆశయమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే... దేశం బలంగా ఉంటుందని చెప్పారు.