గత వారం రోజులుగా, ఐటి మంత్రి నారా లోకేష్, ట్విట్టర్ ద్వారా, ప్రతిపక్షాలకు సమాధానం చెప్తున్నారు. రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి చేసిన తిరుమల ఆరోపణలకు సమాధానం ఇస్తూ, విజయసాయి రెడ్డికి చురకలు అంటించారు లోకేష్. అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దానం పై చేసిన ఆరోపణలకు కూడా అన్ని వివరాలతో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అన్ని పనుల గురించి, వివరాలు ఇచ్చారు. ఏదైనా విషయం తెలుసుకుని స్పందించాలని, ఎవరో అన్నారని బురద చల్లవద్దు అంటూ చెప్పారు.. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా, ప్రతి పక్ష నాయకుడు, వైసిపీ అధ్యక్షుడు జగన్ చేసిన ఆరోపణలకు తన ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.

lokesh 25052018 2

జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి పాదయాత్రలో, కొల్లేరు పై ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆరోపణలు చేసారు. కొల్లేరుని చంద్రబాబు నాశనం చేసారు అని, కబ్జా చేస్తున్నారని, అక్కడి వారి జీవితాలు నాశనం చేసారు అంటూ, జగన్ ఆరోపణలు గుప్పించారు. దీని పై లోకేష్ తన ట్విట్టర్ లో డియర్ A1 అంటూ, జగన్ కూ త్వీట్ చేస్తూ, "ఆపరేషన్ కొల్లేరు" గుర్తు ఉందా, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బాంబులతో, ప్రోక్లియన్లతో 30 వేల ఎకరాల్లో వున్న చేపలు చెరువులు ధ్వంసం చేశారు. వారు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు అని 25 వేల మంది మత్సకారుల జీవనాధారం లేకుండా చేసారు. అధికారంలో ఉన్నపుడు ధ్వంసం చేసిన మీరు ఇప్పుడు కొల్లేరు సర్వే చేయిస్త్తా అని మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు..

lokesh 25052018 3

ఇప్పటి వరకు జగన్ వైపు నుంచి, లోకేష్ చేసిన ట్వీట్ కు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కొల్లేరులో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. అవన్నీ ఇప్పటికీ అక్కడ ప్రజలకు గుర్తున్నాయి.. మళ్ళీ అక్కడకే వచ్చి, జగన్ కొల్లేరు గురించి మాట్లాడుతుంటే, అక్కడి ప్రజలు నవ్వుతున్నారు... ఇవి లోకేష్ చేసిన ట్వీట్లు Dear A1, do you remember Operation Kolleru or have you become a Ghajini? Let me brush your memory a bit. Back then, it was your father who sent in Proclainers to destroy 30K acres Kolleru lake after it was bombed to smithereens, devastating the livelihoods of 25K fishermen. (1/2) For what reason? Just because the community supported TDP. And now you speak lies of conducting a re-survey of the lake and show fake love on the fishermen for votes. They will not fall for your bait!!! (2/2)

Advertisements

Advertisements

Latest Articles

Most Read