రైత‌న్న‌కు సంక్రాంతి ముందే వ‌చ్చింది అని నీ దొంగ పేప‌ర్‌లో దొంగ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకోవ‌డానికి సిగ్గులేదా ముఖ్య‌మంత్రి అంటూ టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పంట‌లు న‌ష్ట‌పోయిన రైతులు, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న అన్న‌దాత‌ల కుటుంబాల‌కు భ‌రోసానిచ్చేందుకు రైతుకోసం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రకాశం జిల్లా,ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మంగ‌ళ‌వారం ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వ‌హించారు. రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను లోకేష్ ముందు ఏక‌రువు పెట్టారు. అనంత‌రం నారా లోకేష్ మాట్లాడుతూ అన్నొస్తున్నాడు అన్నారు...వచ్చాడు.వచ్చి ఏమి పీకాడని నిల‌దీశారు. జ‌గ‌న్‌రెడ్డి త‌న 19 నెలల పాలనలో 767 రైతుల్ని మింగాడ‌ని ఆరోపించారు. రైతుల‌కి ముందే సంక్రాంతి వచ్చింది అని త‌న దొంగ పేప‌ర్‌లో దొంగ‌బ్బాయి కోట్ల రూపాయ‌ల‌తో యాడ్స్ వేయించుకున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే! ముఖ్య‌మంత్రికి పండ‌గ చేసుకోమంటారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పుడు వార్త‌లు రాసే ఈ పేప‌ర్‌ని ఏం చేయాల‌ని అని జ‌నాన్ని అడిగితే...త‌గ‌ల‌బెట్టాల‌ని అంతా ముక్త‌కంఠంతో కోర‌గా.. సాక్షి ప్ర‌తుల‌ను కాల్చేశారు. ఒక పక్క రైతులు ఆ-త్మ-హ--త్య-లు చేసుకుంటుంటే పండగ ముందే వచ్చింది అనడానికి జగన్ రెడ్డికి సిగ్గు లేదా అని ప్ర‌శ్నించారు. 50 లక్షల ఎకరాల్లో 10 వేల కోట్లు నష్టం వస్తే 646 కోట్లు విద‌ల్చ‌డం రైతులకి అన్యాయం చేయ‌డ‌మేన‌న్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహార అంచనాలు కూడా వేయ‌కుండానే ఎకరానికి 25 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసి, నేడు తానే అధికారంలో ఉండి ఎక‌రాకి 5వేలు ఇచ్చి చేతులు దులుపుకోవ‌డం ఆయ‌న మాట త‌ప్పుడు నైజానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. గాలి మాట‌లు చెబుతూ, గాల్లోనే ప‌రామ‌ర్శ‌లు చేసే గాలి ముఖ్య‌మంత్రి, రికార్డింగు డ్యాన్సుల్లో మునిగి తేలుతున్న వ్య‌వ‌సాయ‌శాఖా మంత్రి...క‌ష్టాల్లో ఉన్న రైతుల్ని పూర్తిగా గాలికొదిలేశార‌ని విమ‌ర్శించారు. ‌జగన్ రెడ్డిది దరిద్ర పాదం అనీ, ఆయన వచ్చిన రోజు నుండి ఒక్క పండుగ లేద‌ని, ఆయన లెగ్ ప్రభావంతో అకాల వర్షాలు,వరదలు,తుఫాన్లు వలన రైతులు తీవ్రంగా నష్టపోయార‌ని ఆరోపించారు.

జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్ల గత 30 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం రైతుకి జరిగింద‌న్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం క‌ట్టామ‌ని అసెంబ్లీలో అబద్ధాలు ఆడిన ఫేక్ సీఎం, చివ‌రికి చంద్రబాబు అసెంబ్లీలో బైఠాయించిన తరువాత అర్ధ‌రాత్రి జీవో ఇవ్వ‌డం తెలిసిందేన‌న్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే ముందు రోజు రాత్రి పరిహారం చెక్కు ఆ కుటుంబానికి పంపారు, పోరాడితేగానీ ఏ ప‌నీ చేయ‌రా అని ప్ర‌శ్నించారు. టిడిపి హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు అంటున్న వ్యవసాయ శాఖ మంత్రీ, దుర్గమ్మ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా టిడిపి హయాంలో 3700 కోట్లు అందజేశాం, ఇవ్వ‌లేద‌ని మీరు ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా అని క‌న్న‌బాబుకి స‌వాల్ విసిరారు. టిడిపి హయాంలో తుఫాన్లు వస్తే యుద్ధప్రాతిపదికన రైతుల్ని ఆదుకున్నామ‌ని, వైకాపా పాల‌న‌లో ఏడుసార్లు వ‌ర‌ద‌లు ముంచెత్తితే మానవత్వం లేని జగన్ రెడ్డి రైతుల్ని ఆదుకోవ‌డ‌మే మ‌రిచార‌ని ఆరోపించారు. అన్న‌దాత‌ల్ని ఆదుకోవాల‌ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీశాం,రైతులకు న్యాయం చెయ్యమని డిమాండ్ చేసాం అయినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు, అందుకే మళ్ళీ పోరాటం మొదలుపెట్టామ‌న్నారు. తడిసి దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాల‌ని, ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు, దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు, చేతివృత్తుల వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాల‌న్నారు. అప్పులు తెచ్చుకునేందుకు రైతులకు ఉరి వేసే మీటర్లు బిగించే నిర్ణయం వెనక్కి తీసుకోక‌పోతే మీట‌ర్లు ప‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read