జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన ప్రధాని స్పందనకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతి స్పందించారు. విభజనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరసన గళం వినిపిస్తుంటుంటే.. రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా?. కేంద్రం హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా తీవ్ర ఆవేదనలో ఉంటే ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరచాలని మీరు అనుకుంటున్నారా?. ప్రజల ఆవేదన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లను జతపరచి ప్రధాని మోదీకు ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తారని కోరుకుంటున్నానని, లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
"Dear @narendramodi Sir, if you thought your tweet could cool down AP that's on the boil for its rights, you must read the comments section which I have attached (only a few) for your perusal. Hope it doesn't spoil your Monday #APDemandsSpecialStatus #APDemandsJustice #MondayBlues" మోడీ ట్వీట్‌పై నెటిజన్ల చేసిన స్పందనలో కొన్నింటిని లోకేష్ సేకరించి ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. 'ఏపీ భారతదేశంలో లేదామోడీ నార్త్ ఇండియాకు మాత్రమే ప్రధానిగా ఉన్నారా','విశాఖపట్నంకు రైల్వేజోన్ ఇచ్చే వరకు బీజేపీకి ఓటు వేయవద్దని మేం నిర్ణయించుకున్నాం సర్', 'గుజరాత్‌లోని దొలేరా నిర్మాణంపై కాదు, అమరావతి నిర్మాణంపై దృష్టి సారించండి', 'శుభాకాంక్షలు ఎందుకు, ప్రార్థించడం కంటే సాయం చేసే చేతులు మిన్న అంటారు. మీరు అది చేయండి'.. ఇలా పలువురు నెటిజన్ల ట్వీట్లను లోకేష్ పొందుపర్చారు.
మరో పక్క ప్రధాని ట్వీట్ చేసిన రోజే చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. 2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని సీఎం తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు.