"శ్రీకాకుళంలో వ్యక్తి భూమి అడిగితే ఇవ్వరు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి ఎకరం 30 లక్షలకి ఇచ్చారు, వాళ్లేమో 15 కోట్లకి అమ్ముకుంటున్నారు.." అంటూ నిన్న పవన్ కళ్యాణ్ చౌకబారు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ శ్రీకాకుళంలో వ్యక్తి ఎవరు ? ఏ కంపెనీ పెడతాడు ? అసలు తను ప్రభుత్వం ముందుకు వచ్చాడా లేదా ? ఇలాంటివి ఏవీ చెప్పకుండా, కేవలం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వైజాగ్ వచ్చింది అనే కుళ్ళు బుద్ధితో, పవన్ కళ్యాణ్ నిన్న ఆరోపణలు చేసారు.. ఇక పవన్ ఫాన్స్, ఎవరన్నా నోరు జారితే, వారిని ఎలా ఎగతాళి చేస్తారో చూసాం. ఇప్పుడు పవన్ కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ పట్టుకుని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తి అని అన్నారు. సరే ఇది ఎదో నోరు జారాడులే అనుకుందాం... ఎవరైనా నోరు జారటం సహజం.. కాని, ఇక్కడ ఆ సంస్థకు భూమి ఇవ్వటమే తప్పు అన్నట్టు, ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంది అనే పవన్ ఆరోపణలు మాత్రం సమర్ధనీయం కాదు.

lokesh 09062018 2

పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పై లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఎవరైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇస్తాం అంటే, మన ప్రభుత్వం వారికి రెడ్ కార్పెట్ వేస్తుంది, కాని రెడ్ టేపిజమ్ తో స్వాగతం పలకదు. ఐటి మంత్రిగా నేను పెట్టుబడులు పెట్టేవారిని స్వయంగా ఆహ్వానిస్తాను. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అయ్యింది అంటే, ఊరికే కాదు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అనేది ఫార్చ్యూన్‌-500 కంపెనీ, వారు రియల్ ఎస్టేట్ చేసుకునే అవసరం లేదు. మన రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడితో, 2500 హై ఎండ్ ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే పల్సేస్ అనే టెక్ కంపెనీకి కూడా వైజాగ్ లో భూమి ఇచ్చాం. ఆ కంపెనీ సిఈఓ శ్రీనుబాబు శ్రీకాకుళం జిల్లా వారే" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

lokesh 09062018 3

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 33 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1947లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. ఇలాంటి కంపెనీకి భూమి ఇస్తే, రియల్ ఎస్టేట్ చేసుకుంటుందా ? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే దానికి అర్ధం ఉందా ? ఫార్చ్యూన్‌-500 కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ, కేవలం భూమి అమ్ముకోవటం కోసం, చంద్రబాబుతో ఒప్పందం చేసుకుంటుందా ? అసలు ఈ కంపెనీ మన రాష్ట్రం తీసుకురావటానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ? ఎన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయో తెలుసా ? ఇతర రాష్ట్రాలు పోటీ రాకుండా, ఈ డీల్ ఎంత సీక్రెట్ గా క్లోజ్ చేసారో తెలుసా ? 2017 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన చేసారు... ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ ను కలిసి, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖ దూసుకెల్తుంది అని, అక్కడ కంపనీ పెట్టాలని చంద్రబాబు కోరారు.. అప్పుడు మొదలైన చర్చలు, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 2017 నెలలో, చేసిన అమెరికా పర్యటనలో, సాన్ ఫ్రాన్సిస్కో లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ సేతి,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొయ్ బోయిరియో ని కలిసి డీల్ క్లోజ్ చేసారు... ఇంత కష్టపడి తెచ్చిన కంపెనీని, కూడా హేళన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.. మొన్నటి దాకా జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసేవాడు.. ఇప్పుడు పవన్ కూడా, ఇలాగే తయారు అయ్యాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read