అమరావతి రాజధాని నిర్మాణానికి సంస్థాగత మదుపరుల నుంచి నిధుల సమీకరణకు ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారంపై అమరావతి బాండ్ల బిడ్డింగ్ ప్రక్రియ మొదలైన తొలి గంటలోనే భారీ స్పందన వచ్చింది. అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన రావడంపై ట్విట్టర్‌లో మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. రూ.1300కోట్ల బాండ్లకు గంటలో రూ.2వేల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. నాలుగేళ్లలో రాజధాని అభివృద్ధికి కేంద్రం రూ.1500కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ సీఆర్డీఏ గంటలోనే రూ.2వేల కోట్లు సేకరించగలిగిందని ప్రశంసించారు. చంద్రబాబు, అమరావతి పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఇదే నిదర్శనమని లోకేష్‌ పేర్కొన్నారు. ఇది లోకేష్ ట్వీట్..

lokesh 15082018 2

#Amaravati bonds issued by CRDA for the construction of AP’s Capital debuted as a smashing hit with the institutional investors at the BSE! While bonds were issued for Rs.1300 Cr, within an hour of trading Rs.2000 Cr was subscribed leading to over subscription of Rs. 700 Cr . It is ironical that the Centre managed to give a paltry Rs. 1500 Cr after 4 years of follow up and several requests, but CRDA managed to generate Rs. 2000 Cr in 1 hour. That is how much people trust @ncbn and his vision for Amaravati.

lokesh 15082018 3

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశకత్వంలో అమరావతి నిర్మాణానికి ఇనిస్టిట్యూషనల్ బాండ్లను జారీ చేసిన విజయం సాధించామన్నారు. ఇదే ఉత్సాహంతో మరో 3 నెలల్లో రిటైల్ బాండ్లను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు వీలుగా రిటైల్ బాండ్లు కనీసం రూ. 100 పెట్టుబడి పెట్టే విధంగా మార్కెట్‌లో జారీ చేస్తామని కమిషనర్ వివరించారు. అమరావతి తొలిదశ నిర్మాణ పనులకు రూ. 48 వేల కోట్లు అవసరమని, ప్రపంచ బ్యాంక్, హడ్కో వాణిజ్య బ్యాంకులు, మార్కెట్ బాండ్లు తదితర వనరుల ద్వారా నిధుల సమీకరణ జరుగుతోందని వివరించారు. ఇది అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ముఖ్యమంత్రిపై నమ్మకానికి నిదర్శనమని ఏపీ సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ వీ రామ మనోహరరావు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read