ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు జరిగిన సంఘటన పై, నారా లోకేష్ స్పందించారు. ఈ రోజు నిమ్మల రామానాయడు అసెంబ్లీ క్యస్షన్ హావర్ లో, 45 ఏళ్ళకే, రెండు వేలు పెన్షన్ ఇస్తానన్నారు కదా, అది ఎప్పుడూ ఇస్తారు అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే జగన్ లెగిసి, అసలు నేను ఆ హామీ ఇవ్వలేదు, 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాం అన్నాను అంటూ, ఆ వీడియో అసెంబ్లీలో ప్లే చేసారు. దీని పై అభ్యంతరం చెప్తూ, మేము ఇచ్చిన వీడియో కూడా వెయ్యాలని, మాకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేసారు. ఈ దశలో, వారికి జవాబు చెప్పలేని అధికార పక్షం, అచ్చెంనాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుని, ఈ అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసారు.
దీంతో అసెంబ్లీలోకి వచ్చిన మార్షల్స్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎత్తి అవతల పడేసారు. ఈ సందర్భంలో, నిమ్మల రామానాయుడుని ఎత్తి పడేస్తున్న ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోని పోస్ట్ చేసిన నారా లోకేష్, మీరు చెప్పిన హామీ, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఎప్పుడూ ఇస్తున్నారు అని అడిగినందుకు, ఇలా తీసుకొచ్చి బయట పడేసారని, వారెవా... రాజన్న రాజ్యం... అంటూ పోస్ట్ చేసారు. ప్రజల పక్షాన నిలిచినందుకు రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇది అంటూ ట్వీట్ చేసారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్ ఎత్తి అవతల వేస్తున్న ఫోటోను కూడా నారా లోకేష్ పోస్ట్ చేసారు. మరో పక్క జగన్ మాట తప్పిన విషయం పై కూడా లోకేష్ వీడియో ఒకటి పోస్ట్ చేసారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు పోస్ట్ చేసారు.
ఆ వీడియోలో, జగన్ మోహన్ రెడ్డిని, సాక్షి విలేకరి కొమ్మినేని శ్రీనివాస్, మీకు 45 ఏళ్ళకే 2 వేలు పెన్షన్ హామీ ఇవ్వాలని ఎందుకు అనిపించింది అని అడుగుతూ ఉంటారు. దానికి జగన్ స్పందిస్తూ, నేను వారి కష్టాలు చూసాను, ఎన్నో పనులు చేసి 45 ఏళ్ళకే వాళ్ళు అలిసిపోతున్నారు, అందుకే వారికి 2 వేలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా, దానికి వైఎస్ఆర్, చేయూత అని పేరు పెట్టాను, 45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసి సోదరలుకు, పెన్షన్ ఇస్తాను అంటూ జగన్ సమాధానం చెప్తారు. అయితే ఇదే విషయం లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. "46 ఏళ్లకి @ysjaganగారికి ఉద్యోగం వచ్చింది. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యింది. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేసారు. జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు ఇవ్వాలి. జగన్ గారు మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతోంది." అని లోకేష్ ట్వీట్ చేసారు.