యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో నారా లోకేష్ సెల్ఫీల‌తో ఛాలెంజ్‌లు విసురుతున్నారు. చాలా ప్లాన్డ్‌గా పాద‌యాత్ర‌లో తాను తెచ్చిన కంపెనీల ముందుగా న‌డుచుకుంటూ వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. దిగ‌డ‌మే కాదు తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు తెచ్చిన కంపెనీ ఇద‌ని, నువ్వు తెచ్చిన కంపెనీలు ఏమైనా ఉంటే సెల్ఫీ తీసి పంపు అంటూ చాలెంజ్‌లు విసురుతున్నారు. డిక్స‌న్, జోహో, టీసీఎల్ ఇప్ప‌టివ‌ర‌కూ లోకేష్ తెచ్చిన కంపెనీలు మీదుగా సాగింది పాద‌యాత్ర‌. లోకేష్ చాలెంజుల‌తో అస‌హ‌నంగా ఉన్న వైసీపీ స‌ర్కారు నేరుగా కౌంట‌ర్ ఇవ్వ‌కుండా జ‌గ‌న్ తెచ్చిన కంపెనీలు అంటూ ప్ర‌చారం ఆరంభించారు. అయితే ఇవి కూడా టిడిపి హ‌యాంలో వ‌చ్చిన‌వి, ఒప్పందం చేసుకున్న‌వి ఉన్నాయ‌ని టిడిపి సోష‌ల్మీడియా కౌంట‌ర్ ఎటాక్ చేస్తోంది.  మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. ఈ స‌ద‌స్సుకు ఇప్పటి వరకు 6100 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, మరో 282 మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజ‌ర‌వుతార‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు ఒప్పందాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వంగా వైఎస్ జ‌గ‌న్ రెడ్డి సీఎం అయ్యాక కొత్తగా ఏ కంపెనీలు రాలేదు. ఉన్న‌వి తామే వెళ్ల‌గొడుతున్నామ‌ని అమ‌ర్ రాజా విష‌యంలో గ‌ర్వంగా ప్ర‌క‌టించింది ఏపీ స‌ర్కారు. దేశ‌వ్యాప్తంగా ఏపీ పేరు వింటేనే పారిశ్రామిక‌వేత్త‌లు బెంబేలెత్తి పోతుండ‌డంతో త‌న క్విడ్ ప్రోకో టీముతో కొన్ని ఒప్పందాలు చేసుకుని ప్ర‌చారం చేసుకోవ‌చ్చ‌ని వైసీపీ భావిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నారా లోకేష్  సెల్ఫీ దెబ్బకు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రచారం మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం .. ఈ స‌ద‌స్సుని కూడా బాగా హైలైట్ చేసుకోవాల‌నుకుంటోంద‌ని స‌మాచారం

Advertisements

Advertisements

Latest Articles

Most Read