హైదరాబాద్ లో ఈ మధ్య ఒక ఘటన చోటు చేసుకుంది. కరణ్ కాన్సెప్ట్స్ అని, దరువు వెబ్ సైట్ అని నడిపే కరణ్‌రెడ్డి అనే వ్యక్తి పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యక్తిని పోలీసులు ఆర్రేస్ట్ చేసారు కూడా. అయితే ఈ కరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెలంగాణాలో ఒక పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీకి సన్నిహితుడుగా పేరు ఉంది. ఈయన ఆయా పార్టీలకు చేసిన సేవకు మెచ్చి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవి కూడా ఇచ్చారు. సహజంగా ఇలాంటి చోట పదవులకు డిమాండ్ ఉంటుంది. హేమా హేమీలు పోటీ పడుతూ ఉంటారు. అయితే అలాంటి చోట కూడా, ఇలాంటి వ్యక్తిని పంపించారు అంటే, అతని పరపతి అర్ధం అవుతుంది. అయితే ఇక్కడి వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకుంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే సదరు వ్యక్తి పై ఇప్పుడు హైదరాబద్ లో నమోదు అయిన కేసు చూసి అందరూ అవాక్కయ్యారు. హైదరాబాద్ తార్నాక ప్రాంతానికి చెందిన ఒక యువతితో, ఆ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా సంబంధాలు పెంచుకున్నారు. తరువాత ఆమెను నమ్మించి, మోసం చేసారని, సదరు వ్యక్తితో పాటుగా, అతని భార్యా పై కూడా, ఆ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారు.
అయితే తరువాత విచారణ చేసిన పోలీసులు, ఆ వ్యక్తిని నిన్న అరెస్ట్ చేసారు. యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో, కరణ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే అతని భార్య పైన కూడా కేసు పెట్టగా, ఆమె పరారీలో ఉందని తెలుస్తుంది. బాధిత యువతికి వైద్య పరీక్షలు కోసం హాస్పిటల్ కు తరలించారు. అరెస్ట్ చేసిన కరణ్‌రెడ్డిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే కరణ్‌రెడ్డి అనే వ్యక్తి టిటిడిలో మెంబెర్ కావటంతో, ఇలాంటి వ్యక్తికి తిరుమల లాంటి పవిత్రమైన చోట ఎలా చోటు ఇస్తారు అంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. అడుగడుగునా తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, డిక్లరేషన్ దగ్గర నుంచి, మొన్నటి భక్తుల పై లాఠీ చార్జ్ వారకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను మోసం చేసే కామంధులకు, తిరుమల లాంటి చోట పదవి కట్టబెడతారా అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ అరెస్ట్ అయిన కరణ్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మహిళలను మోసం చేస్తూ అరెస్ట్ అవ్వటం పై, తిరుమల లో ఇలాంటి వారికి పదవులు ఇవ్వటం పై, పలువురు ఆగ్రహం వక్తం చేస్తున్నారు.ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.