టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినట్టే చేసారు. ఏడవ తారిఖు తిరుపతి ప్రచారంలో విసిరిన సవాల్ కు తగ్గట్టుగానే, ఆయన ఈ రోజు తిరుపతి నుంచి అలిపిరి వచ్చారు. అలిపిరి దగ్గర వివేక హ-త్య లో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసారు. వెంకటేశ్వర స్వామీ సాక్షిగా అలిపిరిలో ప్రమాణం చేసిన లోకేష్, ఇప్పుడు ఈ హ-త్య ఎవరు చేసారో ప్రజలకు అర్ధమవుతుందని అన్నారు. అంతకు ముందు లోకేష్ గంటకు పైగా అలిపిరి సర్కిల్ లో కూర్చున్నారు. తాను చేసిన సవాల్ కు కట్టుబడి, వెంకన్న పాదాల దగ్గరకు వచ్చానని, జగన్ మోహన్ రెడ్డి మాత్రం నేను సవాల్ విసిరిన తరువాత తప్పించుకున్నారని అన్నారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని, తాడేపల్లిలో జగన్ ఇంటిలోనే హేలిపేడ్ ఉందని, ఇక్కడకు 45 నిమిషాల్లో రావచ్చు అని, ఆయన వస్తాను అంటే, ఇక్కడే నేను ఎదురు చూస్తానని సవాల్ విసిరారు. ఈ రోజుతో ఈ విషయం తేలిపోవాలని అన్నారు. నారాసుడి చరిత్ర అంటూ, చంద్రబాబు గారి ఫోటోలు వేసి, తన బాబాయ్ ని మేము వేసిసినట్టు చెప్పారని, అందుకే ఈ రోజు అసలు విషయం ఏమిటో వెంకన్న సాక్షిగా తెల్చేద్దాం అంటూ లోకేష్ సవాల్ చేసారు. లోకేష్ తో పాటుగా, అచ్చెంనాయుడు, ఇతర సీనియర్ నేతలు కూడా, అక్కడే గంట పాటు ఎదురు చూసారు.

ln 14042021 2

గంట పాటు ఎదురు చూసినా, అటు జగన్ రెడ్డి కానీ, వైసీపీ నేతలు కానీ, ఎవరూ రాకపోవటంతో, లోకేష్ మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ, గంట పాటు వీరి కోసం ఎదురు చూసామని, ఒక్కరు కూడా వైసీపీ నుంచి మా సవాల్ స్వీకరించేందుకు సిద్ధంగా లేరని, అందుకే ఇక్కడ వరకు రాలేదని అన్నారు. వారు రకాపోయినా, తమకు నీతి నిజాయతీ, దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టి, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని, తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని ప్రమాణం చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. ఒక చెల్లిని హైదరాబాద్ లో వదిలేస్తే, ఇంకో చెల్లి ఢిల్లీలో న్యాయం చేయాలని కోరుతుందని, ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయాలని వాడు, ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. మా పై అనవసరంగా నిందలు వేసారని, ఛాలెంజ్ చేస్తే మాత్రం పారిపోయారని లోకేష్ అన్నారు. ఈ దెబ్బతో, ప్రజలకు వివేక గారి కేసు విషయంలో క్లారిటీ వచ్చిందని లోకేష్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read